Ravi Teja: సంక్రాంతి రేసులో రవితేజ రిస్క్

ఒకప్పుడు మోస్ట్ డిపెండబుల్ హీరో అయిన రవితేజ వరుస ఫ్లాపుల వల్ల క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు. రవితేజ ఒక కమర్షియల్ హిట్ కొట్టి చాలా రోజులైంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన “మాస్ జాతర” అయితే ఫ్యాన్స్ కూడా రిజెక్ట్ చేశారు. కాకపోతే.. కొన్ని సెంటర్లలో మాత్రం డీసెంట్ కలెక్షన్స్ తో సాగుతుంది. అలాంటి సమయంలో రవితేజ తన తాజా చిత్రం “భర్త మహాశయులకు విజ్ఞప్తి”ని సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Ravi Teja

కిషోర్ తిరుమల ట్రాక్ రికార్డ్ అంతగా లేదు, రవితేజ వరుస ఫ్లాపులు, హీరోయిన్లు ఆషిక, డింపుల్ లకు కూడా సంక్రాంతికి క్రౌడ్ ను పుల్ చేసే స్థాయి క్రేజ్ లేదు. ఇక భీమ్స్ సంగీతానికి “మాస్ జాతర” సినిమాతో వచ్చిన రెస్పాన్స్ చూసాం. ఇన్ని నెగిటివ్ పాయింట్స్ ను పెట్టుకుని, టీమ్ ఏ ధైర్యంతో సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు అనేది వాళ్ల లెక్కలకే తెలియాలి. ఆల్రెడీ సంక్రాంతి రేసులో “రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒకరాజు” చిత్రాలు రెడీగా ఉన్నాయి.

సదరు సినిమాల ప్రమోషన్స్ కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో నవంబర్ లో టీజర్ రిలీజ్ చేసి.. రెండు నెలల్లో ప్రమోషన్స్ తో ఆడియన్స్ ను ఎగ్జైట్ చేసి.. సంక్రాంతికి రిలీజ్ అవ్వడం అనేది రవితేజ సినిమాకి పెద్ద టాస్క్. ఏదో ఒక భీభత్సమైన వింత జరిగితే తప్ప “భక్త మహాశయులకు విజ్ఞప్తి” చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుని థియేటర్లలో నిలబడడం అనేది కమర్షియల్ గా వర్కవుట్ అవుతుందో లేదో అనేది అభిమానులకు కూడా పెద్ద ప్రశ్న.

ఇకపోతే.. సినిమా టైటిల్ ను టింగ్లీషులో #BMW అనే హ్యాష్ ట్యాగ్ కోసం Vignyapthi ని Wignyapthi గా మార్చడం అనేది కాస్త కామెడీ అయిపోయింది. తెలుగునే అనుకుంటే టింగ్లీషును కూడా హ్యాష్ ట్యాగ్స్ కోసం ఇలా ఖూనీ చేయడం అనేది ఒకరకంగా బాధాకరం.

తమిళంలో మంచి హిట్ కొట్టిన శివాత్మిక

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus