మాస్ మహారాజ్ రవితేజ నుండి వచ్చిన గత చిత్రం ‘రావణాసుర’ ప్లాప్ అయ్యింది. దీంతో అతని నెక్స్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ పై చాలా అంచనాలు పెట్టుకున్నాడు. దేశాన్ని గజగజలాడించిన స్టూవర్టుపురం దొంగ అయిన నాగేశ్వరరావు జీవిత కథతో ఈ సినిమా రూపొందింది. అందులో కమర్షియల్ అంశాలు చాలా ఉన్నాయి. మరి సినిమాగా ఆ కథని ఎలా ఆవిష్కరించారు అనేది చూడాలి. ఇక రవితేజ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ ఇది కావడంతో నార్త్ లో గట్టిగానే ప్రమోట్ చేశాడు.
‘కార్తికేయ 2’ ‘ది కశ్మీర్ ఫైల్స్’ వంటి పాన్ ఇండియా హిట్లు కొట్టిన అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రానికి నిర్మాత కావడంతో నార్త్ లో ఈ సినిమా పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. వంశీ ఈ చిత్రానికి దర్శకుడు.టీజర్, ట్రైలర్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. అంతా బాగానే ఉంది కానీ ‘టైగర్ నాగేశ్వరరావు’ విషయంలో ప్రేక్షకులకి కొన్ని సందేహాలు ఉన్నాయి. అవేంటంటే.. ఇది ఎంత బయోపిక్ అయినప్పటికీ.. సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని కొంత ఫిక్షన్ ను జోడించారట మేకర్స్.
కానీ ఒరిజినల్ కథ పరంగా చూసుకుంటే.. (Tiger Nageswara Rao) టైగర్ నాగేశ్వరరావు దారుణ హత్యకి గురైనట్టు కొన్ని కథనాలు చెబుతున్నాయి. ఆ రకంగా చూసుకుంటే ఈ ‘టైగర్ నాగేశ్వరరావు’ క్లైమాక్స్ అంతా ట్రాజెడీతో నిండి ఉంటుందా.. లేక క్లైమాక్స్ ను కూడా మార్చేశారా? అనేది తెలియాలి. ఒకవేళ ట్రాజెడీతో నిండిన క్లైమాక్స్ అయితే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న?
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!