Ravi Teja: రవితేజ కూడా సంక్రాంతికేనా..ఈసారి అంతకు మించి..!

ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ రూపంలో రవితేజకి ఓ సక్సెస్ దక్కింది. దీంతో ‘ధమాకా’ తర్వాత వెంటనే రవితేజ ఖాతాలో మరో సక్సెస్ పడినట్టు అయ్యింది. ‘ధమాకా’ రూ.100 కోట్ల షేర్ క్లబ్ లో చేరింది. ‘వాల్తేరు వీరయ్య’ రూ.200 కోట్ల షేర్ క్లబ్ లో చేరింది. అయితే ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ క్రెడిట్ పూర్తిగా రవితేజకి దక్కదు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ తో పాటు సంక్రాంతి సీజన్ కూడా ఆ చిత్రానికి కలిసి రావడం జరిగింది.

అయితే రవితేజ (Ravi Teja) మరోసారి సంక్రాంతి బరిలో దిగాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం అతను ‘టైగర్ నాగేశ్వరరావు’ తో పాటు ‘ఈగల్’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. నిఖిల్ తో సూర్య వెర్సస్ సూర్య చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకుడు.2024 లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు కొద్దిసేపటి క్రితం ఓ వీడియో ద్వారా ప్రకటించింది చిత్రబృందం. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

అనుపమ పరమేశ్వరన్, నవదీప్, మధుబాల , కావ్య థాఫర్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వీడియోలో రవితేజని అయితే చూపించలేదు. కానీ విజువల్స్ బాగున్నాయి. ఇది గ్లిమ్ప్స్ గా కాకుండా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోగానే రిలీజ్ చేసారు. అంతా బాగానే ఉంది కానీ 2024 సంక్రాంతికి మహేష్ బాబు – త్రివిక్రమ్ ల ‘గుంటూరు కారం’ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. అలాగే ప్రభాస్ ప్రాజెక్టు కె కూడా రిలీజ్ అవుతుంది అంటున్నారు. మరి ఆ సినిమాల ముందు రవితేజ ‘ఈగల్’ నిలబడగలదా అన్నది పెద్ద ప్రశ్న.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus