మాస్ మహారాజా రవితేజ హీరోగా ‘టచ్ చేసి చూడు’ పేరుతో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆ సినిమా చిత్రీకరణ పూర్తయింది. .బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాశీఖన్నా, సీరత్ కపూర్ నాయికలు. నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ “మాకు చిరకాల మిత్రుడైన రవితేజ తో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా ఇమేజ్ కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేశారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది“ అని తెలిపారు.