కొంతమంది దర్శకులు కొంతమంది హీరోలను ఉద్దేశించి కథలు రాసుకుంటారు. కానీ ఆ కథలు వాళ్ళు కోరుకున్న హీరోలతోనే చేస్తారా? అంటే కచ్చితంగా చెప్పలేం. చాలా సందర్భాల్లో దర్శకులు అనుకున్నట్టు జరగలేదు. తాము అనుకున్న కథలను.. కోరుకున్న హీరోలతో చేయలేకపోయారు. ఉదాహరణకి హలో బ్రదర్’ సినిమానే తీసుకుందాం. ఆ కథ చిరంజీవి చేయాల్సింది. కానీ నాగార్జునతో చేశారు ఈవీవీ. హీరో మారినా ఫలితం అనుకున్నట్టే వచ్చింది.
దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ‘బ్రహ్మోత్సవం’ అనే కథని ఎన్టీఆర్ తో చేద్దామని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అనుకున్నాడు.కానీ మహేష్ వద్దకు వెళ్ళింది.. సినిమా డిజాస్టర్ అయ్యింది. హిట్టు సినిమాకి కారణాలు అంటూ ఏమీ ఉండవు.కానీ ప్లాప్ సినిమాలకు బోలెడన్ని కారణాలు ఉంటాయి. వాటిని గుర్తిస్తే దర్శకులు చాలా పాఠాలు నేర్చుకోవచ్చు.
సరే ఇక అసలు విషయానికి వెళ్ళిపోదాం.. గోపీచంద్ చేయాల్సిన ఒక సినిమా రవితేజ వద్దకి.. రవితేజ చేయాల్సిన ఇంకో సినిమా గోపీచంద్ వద్దకి వెళ్లాయి. అవే ‘డాన్ శీను’ ‘వాంటెడ్’. గోపీచంద్ మలినేని ‘డాన్ శీను’ తో డెబ్యూ ఇచ్చాడు. ఆ కథని గోపీచంద్ తో చేయాలని అనుకున్నాడు. మరోపక్క ‘వాంటెడ్’ తో దర్శకుడిగా డెబ్యూ ఇచ్చాడు బి.వి.ఎస్.రవి. అయితే ఈ కథని అతను రవితేజతో చేయాలని అనుకున్నాడు.
వీరిద్దరూ కలిసి ఈ కథలు పట్టుకుని తిరిగేవారట. కానీ వీళ్ళు అనుకున్న హీరోలతో కాకుండా రివర్స్ లో చేయాల్సి వచ్చింది. రవితేజతో గోపీచంద్ మలినేని ‘డాన్ శీను’ చేశాడు. అది మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. మరోపక్క గోపీచంద్ తో బి.వి.ఎస్.రవితో చేసిన ‘వాంటెడ్’ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇలా ఈ కథలకు సంబంధించిన హీరోలు మాత్రమే కాదు.. వీటి ఫలితాలు కూడా మారిపోయాయి అని చెప్పాలి.