‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత నాగవంశీ తన సినిమా ప్రమోషన్స్ లో ఎక్కువ హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు. తన సినిమాకి హైప్ పెంచడానికి అతను మీడియాకి ఏ రేంజ్ స్టఫ్ కావాలో అంత మొత్తం ఇస్తారు. ఈ క్రమంలో కాంట్రోవర్సీల్లో కూడా ఇరుక్కుంటారు నాగవంశీ. తర్వాత సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటారు. ‘గుంటూరు కారం’ సినిమా నుండి ఇదే సీన్ రిపీట్ అవుతుంది. అయితే ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా రిలీజ్ టైంలో నాగవంశీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ సినిమాకి చాలా వరకు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి.
కానీ పోటీగా రిలీజ్ అయిన సినిమాలతో పోలిస్తే.. బాక్సాఫీస్ వద్ద మంచి నంబర్స్ చేసింది ఆ సినిమా. అయితే జనాలు ఆప్షన్ లేక ఆ సినిమా చూస్తున్నారు అన్నట్టు పలు మీడియా సంస్థలు ఆ సినిమాని టార్గెట్ చేశాయి. దీంతో నాగవంశీకి కోపం వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టి.. సదరు మీడియా హౌసులను టార్గెట్ చేసి విమర్శలు చేశాడు. ఫస్ట్ టైం ఆ టైంలో నాగవంశీకి సోషల్ మీడియాలో బాగా సర్పోర్ట్ చేశారు నెటిజెన్లు.
ఇప్పుడు నిర్మాత రాజేష్ దండా కూడా అదే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. విషయం ఏంటంటే ఇటీవల రాజేష్ దండా నిర్మించిన ‘K-RAMP’ రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ దీపావళికి వచ్చిన మిగతా సినిమాలతో పోలిస్తే.. ‘K-RAMP’ బెటర్ అనే టాక్ కూడా ఆడియన్స్ నుండి వినిపించింది. దాని వల్ల మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
కానీ ఓ సెక్షన్స్ ఆఫ్ మీడియా ‘K-RAMP’ పై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ట్వీట్లు వేస్తున్నాయి. దీంతో నిర్మాత రాజేష్ దండా స్టేజిపైనే సదరు సైట్స్ ని టార్గెట్ చేసి వార్నింగ్ ఇచ్చారు. ట్విట్టర్లో అయితే ఆ సైట్ పై గ్యాప్ లేకుండా నెగిటివ్ ట్వీట్స్ వేసి హాట్ టాపిక్ గా నిలిచారు. మరి ఈ వివాదం నెక్స్ట్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.