Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘చెప్పాలనిఉంది’ యూనిక్ సబ్జెక్ట్.. ప్రేక్షకులని తప్పకుండా అలరిస్తుంది : ఆర్.బి చౌదరి

‘చెప్పాలనిఉంది’ యూనిక్ సబ్జెక్ట్.. ప్రేక్షకులని తప్పకుండా అలరిస్తుంది : ఆర్.బి చౌదరి

  • November 14, 2022 / 10:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘చెప్పాలనిఉంది’ యూనిక్ సబ్జెక్ట్.. ప్రేక్షకులని తప్పకుండా అలరిస్తుంది : ఆర్.బి చౌదరి

ప్రతిష్టాత్మక సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి చౌదరి సమర్పణలో రూపొందిన 94వ చిత్రం ‘చెప్పాలని ఉంది’. ‘ఒక మాతృభాష కథ’ అనేది ఉప శీర్షిక. యష్ పూరి, స్టెఫీ పటేల్ ప్రధాన పాత్రలలో అరుణ్ భారతి ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించారు. డిసెంబర్ 9న థియేటర్స్ లో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత ఆర్ బి చౌదరి మాట్లాడుతూ..’చెప్పాలని ఉంది’ మా 94వ చిత్రం. సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో చాలా మంది నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేశాం. ఇప్పుడు మరో ప్రతిభావంతుడైన నటుడు యష్ పూరిని హీరోగా పరిచయం చేస్తున్నాం. ‘చెప్పాలని ఉంది’ యూనిక్ సబ్జెక్ట్. డబల్ పాజిటివ్ చూసిన తర్వాత యష్ నటన పట్ల చాలా తృప్తిగా వున్నాం. తనకి చాలా మంచి భవిష్యత్ వుంటుంది. హీరోయిన్ గా చేసిన స్టెఫీ పటేల్ కి కూడా మంచి భవిష్యత్ వుంటుంది. ఈ చిత్రంతో అరుణ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. వైవిధ్యమైన కథలని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పగా ఆదరిస్తారు. అందుకే ఈ చిత్రాన్ని ముందుగా తెలుగులోనే రూపొందించాం. తెలుగు తర్వాత తమిళ్ తో పాటు మిగతా భాషలో రీమేక్ చేస్తాం. ‘చెప్పాలని ఉంది’ యూనిక్ సబ్జెక్ట్. అందరికీ నచ్చుతుంది. హమ్స్ టెక్ ఫిలిమ్స్ తో కలసి ఈ సినిమా చేసాం. విజయ్ చక్కని మాటలు రాశారు. చిత్ర యూనిట్ అందరికీ అల్ ది బెస్ట్” తెలిపారు.

యష్ పూరి మాట్లాడుతూ..’చెప్పాలని ఉంది’ కంప్లీట్ ఎంటర్ టైనర్. యాక్షన్ రోమాన్స్ కామెడీ అన్నీ ఎలిమెంట్స్ వున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ‘చెప్పాలని ఉంది’ కనెక్ట్ అవుతుంది. సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు వుంటాయి. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ లో హీరోగా పరిచయం కావడం నా అదృష్టం. ఆర్.బి చౌదరి గారికి , అంజన్ కుమార్ , యోగేష్ కుమార్ గారికి కృతజ్ఞతలు. డిసెంబర్ 9న థియేటర్స్ లో కలుద్దాం” అన్నారు

స్టెఫీ పటేల్ మాట్లాడుతూ.. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ లో సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఆర్.బి చౌదరి గారికి, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇందులో వెన్నెల అనే పాత్రలో కనిపిస్తాను. ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకులు అరుణ్ గారికి కృతజ్ఞతలు. యష్ తో పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో భాగమైన వారందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రేక్షకులు తప్పకుండా నచ్చుతుంది” అన్నారు.

వాకాడ అప్పారావు మాట్లాడుతూ.. ‘చెప్పాలని ఉంది’ ట్రైలర్ చూస్తూనే ఇందులో డిఫరెంట్ కంటెంట్ వుందని నమ్మకం కలిగించింది. ఈ సినిమా చూశాను. దర్శకుడు చాలా మంది కథతో వచ్చారు. హీరో కొత్త కుర్రాడు. చాలా చక్కగా నటించాడు. హీరోయిన్ కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. దర్శకుడు చాలా అద్భుతంగా తీశారు. మాటల రచయిత విజయ్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ లో చాలా మంచి సినిమాలకు మాటలు రాశారు. ఈ సినిమాలో మాటలు కూడా చాలా కొత్తగా వుంటాయి. ‘చెప్పాలని ఉంది’ నేషనల్ మూవీ. మాతృభాష కథ. యూనివర్షల్ గా అందరికీ కనెక్ట్ అయ్యే కథ. చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్” తెలిపారు.

హమ్స్ టెక్ ఫిలిమ్స్ యోగేష్ మాట్లాడుతూ.. ఆర్.బి చౌదరి గారితో కలసి పని చేయడం గొప్ప గౌరవం. చాలా మంచి క్రియేటీవ్ టీమ్ కలసి పని చేశాం. మీ అందరికీ సహకారం, ప్రోత్సాహం కావాలి” అని కోరారు.

దర్శకుడు అరుణ్ భారతి మాట్లాడుతూ.. ఆర్.బి చౌదరి గారికి కృతజ్ఞతలు ‘చెప్పాలని ఉంది’. నిర్మాతలు అంజన్ కుమార్ , యోగేష్ కుమార్ లకి కృతజ్ఞతలు ‘చెప్పాలని ఉంది’. ఒక మాతృభాష కథ ‘చెప్పాలని ఉంది’. డిసెంబర్ 9న సినిమా విడుదలౌతుంది. మీ అందరి సహకారం ప్రోత్సాహం కావాలి” అని కోరారు.

మాటల రచయిత విజయ్ చిట్నీడి మాట్లాడుతూ.. ఆర్.బి చౌదరి గారి జాలి సినిమాతో చిత్ర పరిశ్రమ కి పరిచయం చేశారు. బాహుబలికి రాసిన తర్వాత చాలా మంది డైలాగ్స్ రాయమని కోరినప్పటికీ రాయలేదు. ‘చెప్పాలని ఉంది’ చిత్రానికి మేమే కోరుకొని రాశాం. కొన్ని సినిమాలకి డబ్బు వస్తుంది. మరికొన్ని సినిమాలకు పేరోస్తుంది. డబ్బు, పేరుతో పాటు గౌరవం తీసుకొచ్చే సినిమా చెప్పాలని ఉంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది” అన్నారు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #cheppalani undi
  • #RB Chowdary

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

13 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

1 day ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

1 day ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

1 day ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

1 day ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version