Peddi: రామ్ చరణ్ ఊరమాస్ పెద్ది.. పోస్టర్ తోనే కిక్కిచ్చారుగా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్  (Ram Charan), ‘ఉప్పెన’  (Uppena) ఫేమ్ బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) కలయికలో రూపొందుతోన్న భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎప్పటి నుంచో టాక్‌లో ఉన్న టైటిల్ ‘పెద్ది’ని (Peddi) మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన రెండు మాస్ పోస్టర్లతో చిత్ర యూనిట్ టైటిల్‌ను ప్రకటించడంతో అభిమానులలో పండుగ వాతావరణం నెలకొంది. చరణ్ గెటప్‌, బ్యాక్‌డ్రాప్, టైటిల్ ఫాంట్ అన్నీ కలసి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి.

Peddi

ఇప్పటికే బుచ్చిబాబు బేస్‌తో ఉండే రఫ్ అండ్ రస్టిక్ టెక్చర్‌ని ప్రేక్షకులు ‘ఉప్పెన’లో చూశారు. ఇప్పుడు చరణ్‌కు ప్రత్యేకంగా డిజైన్ చేసిన పాత్రలో కూడా అదే స్టైల్‌ను మరింత పవర్ఫుల్‌గా చూపించబోతున్నారన్న సంకేతాలు ఈ పోస్టర్ల ద్వారా వెల్లడయ్యాయి. మొదటి పోస్టర్‌లో చరణ్ సిగరెట్ వెలిగించుకుంటూ చాలా ఇంటెన్స్ లుక్‌తో కనిపించగా, రెండో పోస్టర్‌లో హ్యాండిల్ ఉన్న భారీ బ్యాట్‌ను పట్టుకొని తిరిగి చూస్తున్న విధానం చరణ్ పాత్రలోని మాస్ యాంగిల్‌ను బలంగా హైలైట్ చేసింది.

సినిమాలో క్రికెట్ ను హైలెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ‘పెద్ది’ అనే టైటిల్‌కి ఎందుకు వెళ్లారు అన్నది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ పేరు చాలా స్పెషల్. ఒక మాస్ కమ్యూనిటీ లీడర్‌ని సూచించేలా ఉండే ఈ పదం, సినిమాలోని పాత్రకి పూర్తిగా న్యాయం చేసేలా ఉంటుందన్న విశ్వాసంతోనే ఎంపిక చేసినట్టు టాక్. అంతేకాదు, ఇది కేవలం టైటిల్ మాత్రమే కాదు, కథలో పాత్ర కథకు ప్రతీకగా నిలవబోతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టైటిల్‌ను తీసుకొచ్చిన తీరు బుచ్చిబాబు నెక్స్ట్ లెవల్ చూపిస్తాడన్న సంకేతంగా మారింది.

ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ (A.R.Rahman)   సంగీతం అందిస్తుండటం మరో హైలైట్. మాస్ డ్రామాకు రెహ్మాన్ బీజీఎం ఎలా ఉంటుందో అనేది అందరిలోనూ ఆసక్తికరమైన అంశంగా మారింది. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌కు గ్రాండ్ లెవల్లో ప్రొడక్షన్ జరుగుతోంది. మొత్తానికి ‘పెద్ది’ అనే టైటిల్‌తో రామ్ చరణ్ తన కెరీర్‌లో మరో మాస్ రోల్‌కి రెడీ అవుతున్నాడు. పోస్టర్లు చూసిన ఫ్యాన్స్ మాత్రం ఇది ఒక పవర్‌పుల్ డైనమిక్ క్యారెక్టర్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు.

బన్నీ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు.. ఎన్టీఆర్ సినిమా విషయంలో కన్ఫ్యూజ్ చేస్తున్నాడు..!

 

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus