బన్నీ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు.. ఎన్టీఆర్ సినిమా విషయంలో కన్ఫ్యూజ్ చేస్తున్నాడు..!

ఎన్టీఆర్  (Jr NTR)  ప్రస్తుతం ‘వార్ 2’ షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. మరోపక్క అతను లేకుండానే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమా స్టార్ట్ అయిపోయింది. ‘ఎన్టీఆర్ 31’ వర్కింగ్ టైటిల్ తో ఆ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇవి కంప్లీట్ అయ్యాక ‘దేవర 2’ ఉండవచ్చు. అది కూడా కంప్లీట్ అయ్యాక ‘జైలర్’ (Jailer) ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో (Nelson Dilip Kumar) ఎన్టీఆర్ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రాజెక్టు ముందుకెళ్ళేలా కనిపించడం లేదు అనే చర్చ ఇప్పుడు ఊపందుకుంది.

Nelson Dilipkumar

అందుకు కారణం నాగవంశీ (Suryadevara Naga Vamsi ). విషయం ఏంటంటే.. ఈరోజు ‘మ్యాడ్ స్క్వేర్’  (Mad Square)  ట్రైలర్ లాంచ్ జరిగింది.ఇందులో బన్నీ, ఎన్టీఆర్ సినిమాల ప్రస్తావన వచ్చింది. ఇందులో.. ‘బన్నీ  (Allu Arjun) , త్రివిక్రమ్ (Trivikram)  కాంబినేషన్లో రూపొందే మూవీ 2025 సెకండాఫ్లో స్టార్ట్ అవుతుంది. అది బిగ్ స్కేల్ మూవీ’ అంటూ నాగవంశీ తెలిపారు. ఆ తర్వాత నెల్సన్ ప్రాజెక్టుపై కూడా స్పందించాడు. ‘మా బ్యానర్లో నెల్సన్ గారి దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుంది.

కానీ హీరో విషయంలో క్లారిటీ లేదు?’ అంటూ నాగవంశీ పెద్ద బాంబు పేల్చాడు. ఎందుకంటే ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో నెల్సన్- ఎన్టీఆర్ సినిమా ఉంటుంది అని గట్టిగా ప్రచారం జరిగింది. పలు ఇంటర్వ్యూల్లో కూడా నెల్సన్ (Nelson Dilipkumar) – ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా చేయాలని ఆశపడుతున్నట్టు నాగవంశీ తెలిపాడు. కాబట్టి.. ఈ కాంబో ఫిక్స్ అని అంతా అనుకున్నారు.ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్మెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆల్మోస్ట్ ఫిక్స్ అనుకున్న కాంబోలో ‘హీరో ఎవరో ఇప్పుడే చెప్పలేను’ అని నాగవంశీ అనడం ఎవ్వరికీ డైజెస్ట్ చేసుకునేలా అనిపించడం లేదు. ఒకవేళ ఎన్టీఆర్ కి నెల్సన్ (Nelson Dilipkumar) చెప్పిన కథ నచ్చలేదా? లేక ఎన్టీఆర్ తో నాగవంశీ వేరే సినిమా ప్లాన్ చేస్తున్నాడా? లేదు అంటే ఈ న్యూస్ ఇంకా వైరల్ అవ్వాలనేది అతని తాపత్రయమా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

అనిల్ రావిపూడి ట్వీట్ వెనుక అంత మీనింగ్ ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus