RC16: మళ్ళీ ఉప్పెన లాంటి టచ్ ఇవ్వనున్న బుచ్చి!

రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు (Buchi Babu Sana)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC16  (RC 16 Movie)  షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సెట్ వేసుకుని క్రికెట్ నేపథ్యంలోని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్‌తో పాటు ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంటోంది. ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో మరో షెడ్యూల్‌కి మేకర్స్ సిద్ధమవుతున్నారు. అయితే ఈ సారి షూటింగ్ లొకేషన్స్‌కు ఆసక్తికరమైన మార్పులు చేసినట్టు సమాచారం. తదుపరి షెడ్యూల్‌ను రాజధాని ఢిల్లీలో ప్లాన్ చేశారు.

RC16

అక్కడ రెజ్లింగ్ కుస్తీ పోటీలకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం స్పెషల్ సెట్లు ఏర్పాటు చేయనున్నారట. రామ్ చరణ్ ఒక రెజ్లర్ పాత్రలో కనిపించబోతున్నారని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రకు తగ్గట్టుగా కొన్ని బిగ్ స్కేల్ యాక్షన్ ఎపిసోడ్‌లు రూపొందించబోతున్నారు. ఢిల్లీలోని రియల్ లొకేషన్లతో పాటు, అక్కడి స్పెషల్ స్టేడియంలలో షూట్ జరుగనుందని సమాచారం.

కానీ ఇక్కడే కథ ముగియదు. ఢిల్లీలో చిత్రీకరించే సన్నివేశాలకు సన్నిహితంగా కాకినాడ తీరంలో కూడా కొన్ని కీలక భాగాలను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు తన మొదటి చిత్రం ఉప్పెనను ఉప్పాడ బీచ్ ప్రాంతంలో ఎక్కువగా తెరకెక్కించగా, అదే స్థాయిలో RC16లో కూడా ఆ లొకేషన్లను ఉపయోగించనున్నారట. కాకినాడ సమీపంలోని ఉప్పాడ బీచ్ వద్ద కీలక సన్నివేశాల కోసం షూటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది.

కాకినాడ‌లో జరగబోయే సన్నివేశాలు పూర్తిగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఉండబోతున్నాయని లీకులు చెబుతున్నాయి. వీటిని అత్యంత గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు బుచ్చిబాబు ప్రత్యేకమైన ప్రిపరేషన్ చేస్తున్నట్లు సమాచారం. కథలోని ఓ ముఖ్యమైన టర్నింగ్ పాయింట్‌కు సంబంధించిన కీలక సన్నివేశాల కోసం కాకినాడ బీచ్‌ను మళ్లీ ఎంచుకోవడం ఆసక్తికరం. బుచ్చిబాబు తన సినిమాల్లో సముద్ర తీరాన్ని ఓ ప్రత్యేకమైన లొకేషన్‌గా చూపించడంలో సిద్ధహస్తుడు. ఉప్పెనలో దాన్ని అద్భుతంగా చూపించిన ఆయన ఇప్పుడు RC16 కోసం మరోసారి అదే టచ్‌ను రిపీట్ చేయనున్నారట.

పోలీసు విచారణకు స్టార్ హీరోయిన్స్? ఇలా అయితే తారలకు కష్టమే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus