అఖిల్ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఏమిటి ?
- February 22, 2017 / 05:49 AM ISTByFilmy Focus
అక్కినేని అభిమానులకు చేదు వార్త. అక్కినేని ప్రిన్స్ అఖిల్ పెళ్లి ఆగిపోయింది. కింగ్ నాగార్జున, అమలల ముద్దుల తనయుడు అఖిల్ కి జీవీకే రెడ్డి మనుమరాలు శ్రీయా భూపాల్ తో డిసెంబర్‌లో వైభవంగా నిశ్చితార్ధం జరిగింది. ఏడాది మేలో ఇటలీలో డిస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇరు కుటుంబాల బంధుమిత్రులు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. పారిశ్రామికవేత్తలు, దక్షిణాది సినీ పరిశ్రమ పెద్దలు, కొంత మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ టికెట్లను రద్దుచేసుకోమని అక్కినేని, భూపాల్ కుటుంబసభ్యులు చెప్పడంతో అందరూ క్యాన్సిల్ చేసుకున్నారు. విమానయాన సంస్థలు టికెట్ క్యాన్సిల్ చేసుకున్న సంగతిని ద్రువీకరించినట్లు ఈరోజు జాతీయ మీడియా స్పష్టం చేసింది.
ఈ విషయంపై అఖిల్, శ్రీయా స్పందించలేదు. వారి కుటుంబ సభ్యులు అధికారికంగా పెళ్లి రద్దు అయినట్లు చెప్పలేదు. అయినా ప్రేమించి పెళ్లిచేసుకుందామని అనుకున్న ఈ జంట విడిపోవడానికి కారణం ఏమిటని టాలీవుడ్ పరిశ్రమ వర్గాల వారు ప్రశ్నించుకుంటున్నారు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో ఇదే హాట్ టాపిక్ అయింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














