ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ ముగ్గురు కాదు.. ఇద్దరు

తెలుగు నిర్మాణ రంగంలో ప్రొడక్షన్ వేల్యూస్ పరంగా సంచలనం సృష్టించిన సంస్థ “మైత్రీ మూవీ మేకర్స్”. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో వరుస బెట్టి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడమే కాక.. లెక్కకు మిక్కిలి హీరోలు, దర్శకులకు అడ్వాన్స్ లు ఇచ్చి బుక్ చేసుకొని ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచిన సంస్థ ఇది. అటువంటి సంస్థ “సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోనీ” లాంటి సినిమాలతో ఢీలా పడింది. ప్రస్తుతం ఆ సంస్థ నిర్మాణంలో “డియర్ కామ్రేడ్, ఉప్పెన, గ్యాంగ్ లీడర్, అల్లు అర్జున్-సుకుమార్ కాంబో చిత్రం మరియు రామ్ చరణ్-కొరటాల” సినిమాలున్నాయి.

అయితే.. తాజా సమాచారం ప్రకారం ముగ్గురు మిత్రులు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి నడుమ స్నేహం వికటించిందని.. దాంతో మోహన్ చెరుకూరి సపరేట్ గా బ్యానర్ ను మొదలెట్టి.. సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేసుకొంటున్నారని తెలుస్తోంది. దాంతో మొన్నటివరకూ మైత్రీ అనగానే ముగ్గురు స్నేహితులు గుర్తుకొచ్చేవారు కాస్తా.. ఇద్దరు స్నేహితులుగా మిగిలిపోయారు. మరి వారి నడుమ పొరపచ్చాలు రావడానికి కారణం ఏమిటనేది ప్రస్తుతానికి ఎవరికీ తెలియని విషయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus