సైరా… నరసింహారెడ్డి సినిమా షూటింగ్ ఆలస్యానికి కారణం తెలుసా?

  • September 30, 2017 / 02:44 PM IST

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథతో తీస్తున్న మెగాస్టార్ 151వ చిత్రం సైరా… నరసింహారెడ్డి, ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అన్ని ఫైనలైజ్ అయినా షూటింగ్ మాత్రం ఇంకా మొదలుపెట్టలేదు. అక్టోబరు నుంచి ప్రారంభించే అవకాశం ఉందని చిత్ర యూనిట్ చెబుతున్న, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వచ్చేనెలలోనూ ఈ సినిమా షూట్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దానికి కారణం సైరా సినిమా కోసం సినిమాటోగ్రాఫర్ గా రవివర్మన్ ను ప్రకటించారు. కానీ అతడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి రత్నవేలు వచ్చాడు. అయితే రత్నవేలు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం-1985 షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. రంగస్థలం పూర్తయితే తప్ప రత్నవేలు సైరా కోసం పనిచేసే అవకాశం లేదు. కాబట్టి అంతవరకు సైరా టీం ఎదురుచూడక తప్పదు.

సైరా సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ రిలీజ్ చేయబోతున్నారు. అందుకే తమిళ నటుడు విజయ్ సేతుపతి – కన్నడ స్టార్ హీరో సుదీప్ – బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వంటి వారు ఇందులో కీలకపాత్రలు పోషించబోతున్నారు. ఈ సినిమాకు పనిచేసే టెక్నీషియన్స్ ను కూడా ఆయా రంగాల్లో బెస్ట్ అనేవారినే ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానుల్లో ఆసక్తి విపరీతంగా ఉన్నా వారు మరికొంత కాలం ఎదురుచూడాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus