మాటల ‘మాంత్రికుడి’ మౌనం వెనుక కారణం?

త్రివిక్రమ్ శ్రీనివాస్!! టాలీవుడ్ సినిమాకు తన స్క్రీన్‌ప్లే తో సరికొత్త అర్ధం చెప్పిన దర్శకుడు త్రివిక్రమ్. ఆయన చేసిన సినిమా ఫలితాలు, రికార్డుల సంగతి పక్కన పెడితే ఆయన సందించే పదునైన సంభాషణలే సినిమాకు ప్రాణం పోసే విధంగా ఆయన సినిమాలు ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. తాజాగా ఆయన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో  తీసిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడిన తరువాత చాలా కాలం గ్యాప్ తరువాత త్రివిక్రమ్ నితిన్ తో ‘అ..ఆ’ అన్న సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే.

ఇక మరో పక్క నితిన్ సైతం దాదాపు పదేళ్లుగా సరైన హిట్ లేక ఇష్క్ సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కాడు. లక్ కలిసి వచ్చింది అని అనుకున్న క్రమంలో మళ్ళీ చిన్నదాన నీకోసం, కొరియర్ బోయ్ కల్యాణ్ ఫ్లాస్ రూపంలో పలకరించడంతో ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలి అన్న ఆలోచనతో త్రివిక్రమ్ తో జతకట్టాడు. ఇదిలా ఉంటే ఎప్పుడూ లేని విధంగా త్రివిక్రమ్ సినిమా విషయంలో చాలా విషయాలు చోటు చేసుకుంటున్నాయి.

అదేమిటంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలు ఆయన రేంజ్ కు తగ్గట్టు ప్రమోషన్ జరగకపోవడం, సినిమా విడుదల పోస్ట్ పోన్ చేసేందుకు సన్నాహాలు జరుగుతూ ఉండడం. ఇవన్నీ చూస్తూ త్రివిక్రమ్ మౌనం వహిస్తూ ఉండడం. ఇక ఒకటి కాదు…రెండు కాదు మన మాటల మాంత్రికుడి సినిమా విషయంలో ముందు ఎన్నడూ లేని ఎన్నో ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎదురవుతున్నాయి. మరి దీనిపై త్రివిక్రమ్ ఏమంటాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus