నాగ చైతన్య-సమంత రిసెప్షన్ కు బాలయ్య అందుకే రాలేదా ?

  • November 13, 2017 / 03:28 PM IST

నందమూరి వారు అంతే ప్రేమిస్తే ప్రాణమిస్తారు, అదే కోపం వస్తే ప్రాణం పోతున్నా పట్టించుకోరు. ఈ విషయం నిన్న జరిగిన నాగచైతన్య-సమంతల ఎంగేజ్ మెంట్ లో మరోమారు ప్రూవ్ అయ్యింది. గత కొన్నేళ్లుగా నందమూరి బాలకృష్ణ-అక్కినేని నాగార్జునల నడుమ కారణాంతరాల వలన సరైన రిలేషన్ లేదు. నాగార్జున ఏదైనా ఈవెంట్స్ కి వస్తే దానికి బాలకృష్ణ అటెండ్ అవ్వకపోవడం.. ఒకవేళ బాలయ్య ఏదైనా ఈవెంట్ కి హాజరైతే దానికి నాగార్జున గైర్హాజరు కావడం అనేది షరా మామూలే. మొన్నామధ్య ఒక ఈవెంట్ లో నాగార్జున మీడియా ముఖంగా “బాలయ్యతో నాకెప్పుడూ గొడవలు లేవు, మేము మంచి స్నేహితులం” అంటూ చెప్పినప్పటికీ.. నిన్న సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగిన నాగచైతన్య-సమంతల ఎంగేజ్ మెంట్ ను నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ, ఎన్టీయార్ హాజరుకాలేదు.

దాంతో.. బాలయ్య-నాగార్జునల నడుమ గొడవలు ఇంకా సర్ధుమణగలేదని అర్ధమవుతూనే ఉంది. అయితే.. బాలయ్యకంటే పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి హాజరవ్వలేదు. కానీ.. సమంతతో మూడు సినిమాల్లో జంటగా నటించి ఉండి కూడా ఎన్టీయార్ ఈ వేడుకకు హాజరుకాకపోవడం అది కూడా హైద్రాబాద్ లో ఉండి చర్చనీయాంశం అయ్యింది. కేవలం బాలయ్య మీద ఉన్న గౌరవంతో ఎన్టీయార్ వెళ్లలేదా లేక మరింకేదైనా కారణమా అని ఆలోచిస్తున్నారు జనాలు. కారణం ఏదైనా కావచ్చు.. ప్రస్తుతం ఏ ఇష్యూ మాత్రం ఫిలిమ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus