2002లో విడుదలైన “మన్మధుడు” సినిమా సూపర్ హిట్ అవ్వడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తుల్లో ముఖ్యుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన రాసిన కథ-మాటలు వల్లే సినిమా సూపర్ హిట్ అయ్యింది అనేది ఎవ్వరూ కాదనలేని నిజం. అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ను “మన్మఢుడు 2 డైరీస్” ఈవెంట్ కు ఆహ్వానించలేదు నాగార్జున. పోనీ క్యాస్ట్ & క్రూ ఎవర్నీ పిలవలేదా అంటే.. దర్శకుడు విజయ్ భాస్కర్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ లు అదే ఈవెంట్ లో కనిపించారు. కానీ.. విచిత్రంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఆదేరోజు కాకినాడలో జరిగిన “రణరంగం” ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కనిపించారు.
అయితే.. నాగార్జునకు త్రివిక్రమ్ మీద కోపం వచ్చిందని. అందుకే ఆయన్ను అవాయిడ్ చేస్తున్నాడని తెలుస్తోంది. అందుకే.. మొన్నామధ్య ఓ ప్రముఖ యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నాగార్జున మాట్లాడుతూ.. “మన్మధుడు అప్పట్లో పెద్ద హిట్ ఏమీ కాలేదు. యావరేజ్ సినిమా. ఇప్పుడు జనాలు టీవీలో చూసి బ్లాక్ బస్టర్ అనుకొంటున్నారు అంతే” అని చెప్పుకొచ్చాడు. త్రివిక్రమ్ మీద నాగార్జునకు కోపం రావడానికి కారణం ఏంటంటే.. గత కొంతకాలంగా నాగచైతన్య లేదా అఖిల్ తో ఒక సినిమా చేయమని నాగార్జున దర్శకుడు త్రివిక్రమ్ ను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాడట. కానీ త్రివిక్రమ్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. అదన్నమాట సంగతి!