ప్రభాస్ ఎక్కువగా ఎందుకు ఖర్చు చేస్తారో తెలిసింది!

  • May 25, 2017 / 06:48 AM IST

స్టార్ హీరో అనగానే కాస్ట్లీ కార్లు, హై క్లాసు భవనాలు కోసం ఎక్కువగా ఖర్చు చేయడం సర్వ సాధారణం. విదేశీ టూర్లు, విహార యాత్రలు కూడా కామనే. కానీ ఇవేమి తనకు ఎక్కువగా ఇష్టముండదని ప్రభాస్ చెప్పారు. తాను సంపాదించిన డబ్బులను ఎందుకు ఎక్కువగా ఖర్చుపెడతారో రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించారు. ఔట్ డోర్ స్పోర్ట్స్ ఆడటానికి ఎక్కువగా ఇష్టపడే ప్రభాస్ స్టార్ హీరో అయిన తర్వాత ఆ సమయం, వీలు లేకపోవడంతో హైదరాబాద్ లోనే సాండ్ వాలీబాల్ కోర్ట్ ఏర్పాటు చేసుకున్నారు. అందుకోసమే ఇప్పటివరకు తాను ఎక్కువగా ఖర్చు చేసినట్లు వివరించారు.

ఆ కోర్టులో ప్రభాస్ తన స్నేహితులతో కలిసి ఎక్కువసేపు గడుపుతారని, తన సమయాన్ని, ఎనర్జీని ఇక్కడే ఖర్చు చేస్తారని ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది. ‘నాకు వాలీబాల్ ఆడటం అంటే చాలా ఇష్టం. సమయం చిక్కినప్పుడల్లా నా స్నేహితులతో కలిసి వాలీబాల్ ఆడటానికే సమయం కేటాయిస్తాను. అంతేకాదు ట్రెక్కింగ్,  రాక్ క్లైంబింగ్ కూడా ఇష్టమే. బాహుబలి-2లో అంత ఫిట్ గా ఉండటానికి రాక్ క్లైబింగ్ కూడా ఎంతో ఉపయోగపడింది” అని ప్రభాస్ వ్యక్తిగత విషయాలను చెప్పారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus