Rajasekhar, Gopichand: రాజశేఖర్ అందుకే ఓకే చెప్పారా?

సీనియర్ హీరోలలో ఒకరైన రాజశేఖర్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలేవీ హిట్ కాలేదనే సంగతి తెలిసిందే. సక్సెస్ కోసం రూటు మార్చిన రాజశేఖర్ శ్రీవాస్ డైరెక్షన్ లో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోలో హీరోగా సక్సెస్ కావడం కష్టమని భావించిన రాజశేఖర్ విభిన్నమైన పాత్రలను ఎంచుకుని కెరీర్ లో సక్సెస్ సాధించాలని అనుకుంటున్నారని సమాచారం. శ్రీవాస్ సినిమాలో హీరో పాత్రకు సమానంగా రాజశేఖర్

పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని పాత్ర నిడివి కూడా ఎక్కువ ఉంటుందని సమాచారం. గోపీచంద్ తండ్రి టీ కృష్ణ అంటే రాజశేఖర్ కు ఎంతో గౌరవం కావడంతో రాజశేఖర్ వెంటనే ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని భోగట్టా. ఈ సినిమాతో పాటు శివకార్తికేయన్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించే అవకాశం రాజశేఖర్ కు వచ్చినట్టు తెలుస్తోంది. దాదపు మూడు దశాబ్దాల క్రితం రాజశేఖర్ ఇతర హీరోలతో కలిసి నటించారు.

సీనియర్ హీరోలకు మార్కెట్ అంతకంతకూ తగ్గుతున్న నేపథ్యంలో రాజశేఖర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజశేఖర్ నటించిన సినిమాలు సక్సెస్ సాధిస్తే ఆఫర్లు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మల్టీస్టారర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్న నేపథ్యంలో రాజశేఖర్ గోపీచంద్ కాంబోపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్య కాలంలో గోపీచంద్ నటించిన సినిమాలేవీ హిట్ కాలేదు. శ్రీవాస్ గోపీచంద్ కాంబో బ్లాక్ బస్టర్ కాంబో కావడంతో గోపీచంద్ కూడా ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus