నా కోరిక తీరేలా లేదు : రాశీ ఖన్నా

“ఊహలు గుసగుస లాడే” సినిమాలో క్యూట్ గా యువతను గిలిగింతలు పెట్టిన నటి రాశీ ఖన్నా. ఢిల్లీ లో పుట్టిన ఈ భామ ఈ చిత్రంలోనూ ఢిల్లీ సుందరిగా ఆకట్టుకుంది. తెలుగు తెరపై కనిపించక ముందే రాశీ ఖన్నా ‘మద్రాస్ కేఫ్’ అనే బాలీవుడ్ చిత్రంలో నటించింది. “అసలు నేను నటిగా అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. మంచి రచయిత్రిగా ఎదగాలని కలలు కనేదాన్ని. అనుకోకుండా హిందీ సినిమాలో అవకాశం రావడంతో నటించాను.

అప్పుడే సినీ రంగం పై ప్రేమ మొదలైంది. అందుకే నటనలో శిక్షణ తీసుకుందామని అనుకున్నాను” అని ఓ ఇంటర్వ్యూ లో రాశిఖన్నా చెప్పింది. సుప్రీమ్ చిత్రంలో బెల్లం శ్రీదేవి పాత్రలో రాశిఖన్నా వినోదాన్ని పండించింది. ఈ సినిమా విజయంలో ఉన్న ఆమెను ఇంతకీ మీరు నటనలో శిక్షణ తీసుకున్నారా? అని అడగగా.. “నా కోరిక ఇక తీరేలా లేదు. మద్రాస్ కేఫ్ రిలీజ్ అయినా వెంటనే తెలుగు పరిశ్రమ నుంచి అవకాశాలు వచ్చాయి. “ఊహలు గుసగుస లాడే” నన్ను తీరిక లేకుండా చేసింది.

వరుసగా సినిమాల్లో బిజీ అయిపోయాను. ఇనిస్టిట్యూట్ కి వెళ్లి నటన నేర్చుకోవడం కన్నా .. సెట్ లోనే ఎన్నో నేర్చుకోవచ్చని తెలిసింది. ఓ వైపు నటిస్తూనే మెళకువలు తెలుసుకుంటున్నాను.” అని చెప్పింది. ప్రస్తుతం  రాశిఖన్నా గోపీచంద్ సరసన ఆక్సిజన్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో గ్రామీణ యువతి పాత్రలో ఆమె కనిపించబోతున్నట్లు తెలిసింది. మాస్ మాహా రాజ్ రవితేజ పక్కన కూడా జత కట్టనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus