టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించినా స్టార్ డైరెక్టర్ గా మెహర్ రమేష్ గుర్తింపును సంపాదించుకోలేకపోయారు. పూరీ జగన్నాథ్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన మెహర్ రమేష్ కంత్రి సినిమాతో టాలీవుడ్ లో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత మెహర్ రమేష్ ప్రభాస్ తో బిల్లా మూవీని తెరకెక్కించగా ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.
కంత్రి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఎన్టీఆర్ మెహర్ రమేష్ చెప్పిన శక్తి కథ నచ్చడంతో ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే 45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన శక్తి బాక్సాఫీస్ దగ్గర్ ఫ్లాప్ కావడంతో పాటు ఎన్టీఆర్ గెటప్ పై విమర్శలు వచ్చాయి. శక్తి డిజాస్టర్ తరువాత వెంకటేష్ హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన షాడో సినిమా సైతం ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది.
అయితే మెహర్ రమేష్ ట్రాక్ రికార్డు బాలేకపోయినా మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ డైరెక్షన్ లో వేదాలం రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిరంజీవి మెహర్ రమేష్ కు ఓకే చెప్పడంపై మెగాభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే మెగాస్టార్ మెహర్ రమేష్ కు ఛాన్స్ ఇవ్వడం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయి. మెహర్ రమేష్ మెగాస్టార్ కుటుంబానికి సమీప బంధువు కావడంతో పాటు చిరంజీవికి సంబంధించిన సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. మెహర్ రమేష్ స్ట్రెయిట్ సినిమాలు ఫ్లాప్ అయినా రీమేక్ సినిమాలు కన్నడలో హిట్లు కావడంతో చిరంజీవి మెహర్ రమేష్ కు ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వేదాలం రీమేక్ తో అయినా మెహర్ రమేష్ సక్సెస్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?