Rajamouli: లవ్ స్టోరీ చేయాలనుకున్న రాజమౌళి.. కానీ?

ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అయితే జక్కన్న సక్సెస్ వెనుక రాజమౌళి భార్య రమా రాజమౌళితో పాటు ఆయన కుటుంబం కూడా ఉంది. రాజమౌళి ఏ సినిమాను తెరకెక్కించినా ఆ సినిమా కోసం జక్కన్న ఏ స్థాయిలో కష్టపడతారో ఆయన కుటుంబం కూడా అదే స్థాయిలో కష్టపడుతుంది. మగధీర బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాజమౌళి చిన్న సినిమాలైన మర్యాదరామన్న, ఈగ సినిమాలను తెరకెక్కించారు.

Click Here To Watch NOW

ఆ తర్వాత బాహుబలి సిరీస్ తో కనీవిని ఎరుగని సక్సెస్ ను సొంతం చేసుకున్న జక్కన్న బాహుబలి సిరీస్ తర్వాత కూడా చిన్న సినిమాను చెయ్యాలని అనుకున్నారట. అద్భుతమైన ప్రేమకథను తెరకెక్కించి విజయాన్ని సొంతం చేసుకోవాలని జక్కన్న భావించారట. అయితే రాజమౌళి వైఫ్ అయిన రమా రాజమౌళి మాత్రం సినిమా విషయంలో ఏ సినిమా తీస్తే బెస్ట్ అని అనిపిస్తుందో ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవాలని జక్కన్నకు సూచించారు.

రమా రాజమౌళి కామెంట్ల వల్ల చిన్న సినిమా తెరకెక్కించాలని అనుకున్న జక్కన్న తన నిర్ణయాన్ని మార్చుకుని ఇద్దరు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాతో సక్సెస్ ను అందుకున్నారు. ఈ సినిమాకు పని చేసిన నటులలో ఒకరైన మకరంద్‌ దేశ్‌పాండే ఆర్ఆర్ఆర్ గురించి ఈ కీలక విషయాలను వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ మూవీ క్లైమాక్స్ లో ఎన్టీఆర్ భుజాల పైకి ఎక్కి చరణ్ ఫైట్ చేసే సీన్ ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతోందని మకరంద్‌ దేశ్‌పాండే పేర్కొన్నారు.

సెట్స్ లో తారక్ ఎప్పుడూ సినిమాల గురించి తనతో చర్చించేవారని ఆయన వెల్లడించారు. తాను సినిమాలో కచ్చితంగా నటించాలని చెప్పి రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో నన్ను తీసుకొని మంచి రోల్ ఇచ్చారని ఆయన అన్నారు. ఆర్ఆర్ఆర్ ఇప్పటివరకు 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus