బ్రహ్మోత్సవం.. ఎందుకు చూడాలంటే ?

  • May 19, 2016 / 11:15 AM IST

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా బ్రహ్మోత్సవం. క్లీన్ యు సర్టిఫికేట్ అందుకుని శుక్రవారం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాను అభిమానులతో పాటు, సామాన్య ప్రేక్షకుడు ఎందుకు చూడాలి? అనే ప్రశ్నవేసుకుంటే… ఈ చిత్రంలో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి.

కుటుంబ విలువలు
సాధారణంగా ప్రేక్షకుడు సినిమాలోని హీరోలో తనని చూసుకుంటాడు. తను చేయలేనిది హీరో చేస్తుంటే సంతోషపడుతాడు. తను మిస్ అయిన వాటిని హీరో పొందుతుంటే సంతృప్తి చెందుతాడు. అటువంటి సీన్లు కొన్ని ఉంటె చాలు సులువుగా కనెక్ట్ అవుతాడు. కనక్ట్ అయితే హిట్టే. అందుకు ఉదాహరణే శ్రీమంతుడు. మన సొంత ఊరి బాగు కోసం ఏమైనా చేయాలి అనే అంశంతో ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరిలోనూ జన్మభూమి కోసం ఏదైనా చేయాలనే కోరిక ఉంటుంది. కాని చేయలేరు. ఆ వెలితిని తొలిగించిన శ్రీమంతుడుని ప్రేమించారు.

బ్రహ్మోత్సవం లైన్ కూడా అందరికి కనెక్ట్ అవుతుంది. తమ పూర్వీకుల అందరిని ఒకే చోట, ఒకే సారి చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ కోరికను బ్రహ్మోత్సవం సంతృప్తి పరుస్తుంది. రెండున్నర గంటల పాటు హీరో కుటుంబంతో కలిసిపోయి ఆనందిస్తాడు.

హీరో డ్రెస్ల కోసం రూ.కోటి
మహేష్ బాబుకి లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ. అతన్ని బ్రహ్మోత్సవంలో మరింత అందంగా చూపించడానికి నిర్మాతలు కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. డిజైనర్ అక్షయ్ త్యాగి తో వంద డ్రెస్లను డిజైన్ చేయించారు. ఆ డ్రస్ లలో మహేష్ మెరిసిపోనున్నారు. రాజకుమారుడిని చూసి అమ్మాయిలు మురిసిపోనున్నారు.

ముగ్గురితో రొమాన్స్
బ్రహ్మోత్సవంలోమహేష్ ముగ్గురు (సమంత, కాజల్, ప్రణీత)తో రొమాన్స్ చేయనున్నారు. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంతతో కలిసి మహేష్ నటించారు. వీరి సీన్లు చాలా ఫన్నీగా ఉంటాయి. హిట్ ఫెయిర్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. బిజినెస్ మాన్ సినిమాలో ప్రిన్స్, కాజల్ తో ఆడి పాడాడు. అదీ హిట్. వీదిద్దరి తో పాటు కొత్తగా ప్రణీతతో కలిసి కనిపించనున్నారు. ముగ్గురు నాయకలను ఒకే సినిమాలో చూడడం యువకులకు పండగే.

సత్య రాజ్ తో తొలిసారి..
తమిళ నటుడు సత్యరాజ్ తెలుగు సినిమాల్లో మంచి పాత్రల్లో కనిపిస్తున్నారు. మిర్చి మూవీలో ప్రభాస్ కి తండ్రిగా ఆకట్టుకున్నారు. బాహుబలిలో కట్టప్పగా అదరగొట్టారు. తొలిసారి మహేష్ బాబుకి తండ్రిగా సత్యరాజ్ నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ ఫ్రెష్ ఫీల్ ని అందించనుంది.

భారీ తారాగణం
‘బ్రహ్మోత్సవం’ లో సత్య రాజ్ తో పాటు ప్రముఖ తెలుగు సినీ నటీనటులు నటించడం విశేషం. జయసుధ, రేవతి, తనికెళ్ళ భరణి, షాయాజీ షిండే, శుభలేఖ సుధాకర్‌, రావు రమేష్‌, బ్రహ్మాజీ, నరేష్‌, పావని గంగిరెడ్డి, ఈశ్వరిరావు, తులసి, కృష్ణభగవాన్‌.. ఇలా దాదాపు 25 మంది గొప్ప నటులు ఒకే కుటుంబం సభ్యుల్లా సందడి చేసారు.

ఇన్నీ ప్రత్యేకతలు ఉన్నాయి కనుకనే ‘బ్రహ్మోత్సవం’ సినిమాను చూసేందుకు అభిమానులు ఎదురుస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus