మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు ఈ చిత్రాన్ని నిర్మించగా రాంచరణ్ సహా నిర్మాతగా వ్యవహరించాడు. పూజా హెగ్డే చరణ్ కు జోడీగా నటించిన మూవీ ఇది. ఏప్రిల్ 29 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కరోనా కారణంగా రెండేళ్ళుగా ఈ చిత్రం షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. ఇక విడుదల విషయంలో కూడా డిలే అవుతూనే వచ్చింది. ఈ మూవీ కచ్చితంగా చూడడానికి ఆకర్షించే అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1) అపజయమెరుగని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన మూవీ ఇది. ఈయన సినిమాల్లో అభిమానులకి కావాల్సిన అన్ని అంశాలు ఈయన సినిమాల్లో ఉంటాయి. మరి ఈ మూవీలో ఆయన ఎలాంటి మెసేజ్ ఇచ్చాడో..!
2) మెగాస్టార్ చిరంజీవికి 153 వ సినిమా ఇది. ఈయన గత సినిమా సైరా లో చిరు నుండీ అభిమానులు ఆశించే కొన్ని అంశాలు మిస్ అయ్యాయి. ఆ సినిమాలో ఆయన లుక్ కూడా నిరాశపరిచింది. అయితే ఈ మూవీలో చిరు లుక్ బాగుంది. మాస్ అంశాలు ఉంటే చిరు చెలరేగిపోవడం ఖాయం కాబట్టి.. ఈ మూవీలో ఆయన నట విశ్వరూపం చూపించే అవకాశాలు ఉన్నాయి
3) రాంచరణ్ ఈ చిత్రంలో సిద్ధ అనే పాత్రని పోషించాడు. ఆయన తండ్రి చిరుతో ఈసారి ఎక్కువ స్క్రీన్ స్పేస్ కలిగిన పాత్ర దొరికింది. కాబట్టి మెగా ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ అనే చెప్పాలి.
4) పూజా హెగ్డే.. మన బుట్టబొమ్మ ఈ మూవీలో నీలాంబరి అనే పాత్రని పోషించింది. ఆమె లుక్స్ కూడా బాగున్నాయి.
5) సోనూ సూద్ : రియల్ హీరో సోనూ సూద్ ఈ చిత్రంలో విలన్ షేడ్స్ కలిగిన పాత్రని పోషించాడు. చిరుకి ధీటైన విలన్ గా ఆయన కనిపించాడు.
6) ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించాడు. అతను కూడా మంచి పెర్ఫార్మర్ కాబట్టి అది కూడా ఆకర్షించే అంశమే..!
7) రెజీనాతో సానా కష్టం అనే ఐటెం సాంగ్ బాగా వచ్చిందట.
8) చిరు – చరణ్ లు కలిసి చిందేసిన భలే భలే బంజారా పాట కూడా హైలెట్ గా నిలుస్తుందని అంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
9) మణిశర్మ నేపథ్య సంగీతం ఓ రేంజ్ లో ఇస్తూ ఉంటారు. ఈ సినిమాకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి ఉంటారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
10) క్లైమాక్స్ ఫైట్ … కుంకుమలో తీసినట్టు చరణ్ చెప్పాడు. ఈ ఫైట్ ను 12 రోజులు తీసారట. ఈ ఫైట్ చాలా బాగా వచ్చింది అని వినికిడి.
అంతేకాదు ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్, సిద్ధ ఎందుకు దర్మస్థలి కి దూరమయ్యాడు, మెయిన్ విలన్ ఎవరు అనే అంశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయని తెలుస్తోంది.