30 రోజుల్లో జనతా గ్యారేజ్ సాధించిన రికార్డులు

హిట్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన చిత్రం జనతా గ్యారేజ్ టాలీవుడ్ లోని రికార్డులకు రిపేర్లు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ ఫిల్మ్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, కేరళ, విదేశాల్లోనూ మంచి ఆదరణ లభిస్తోంది. జనతా గ్యారేజ్ 30 రోజులకు (సెప్టెంబర్ 30) ప్రపంచవ్యాప్తంగా 135.20 కోట్ల గ్రాస్ రాబట్టింది. 84 కోట్లు షేర్ దక్కించుకొని లాభాలను పంచి పెడుతోంది. 30 రోజుల్లో జనతా గ్యారేజ్ సాధించిన రికార్డులివే….

– తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 32 కోట్లు కలక్షన్స్ వసూల్ చేసి బిగ్గెస్ట్ ఓపెనింగ్ (నాన్ బాహుబలి) గా నిలిచింది.

– అమెరికాలో ప్రీమియర్ షో ల ద్వారా 5 లక్షల 60 వేల డాలర్లు కలెక్ట్ చేసి బాహుబలి, అత్తారింటికి దారేది తర్వాత భారీ వసూళ్లు రాబట్టిన       మూడో చిత్రంగా నిలిచింది.

– మూడు రోజుల్లో 51 కోట్లు రాబట్టి అత్యంత్య వేగంగా 50 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి చిత్రం(నాన్ బాహుబలి) గా రికార్డ్ సృష్టించింది.

– ఏడు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లకు సినిమా హక్కుల కోసం పెట్టిన మొత్తం వచ్చేసింది. ఎనిమిదొవ రోజు నుంచే లాభాలను తెచ్చి పెట్టింది.

– 10 రోజులలోపే 100 కోట్లు గ్రాస్ వసూలు చేసి అతి తక్కువ సమయంలోనే ఈ మార్కు కి చేరిన రెండో చిత్రంగా రికార్డ్ నమోదు చేసింది.

– వేగంగా 80 కోట్ల షేర్ క్లబ్ లో చేరిన చిత్రంగా జనతా గ్యారేజ్ చేరింది.

– 2016 లో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రంగా గ్యారేజ్ నిలిచింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus