Regina Cassandra: తన డేటింగ్ వ్యవహారాల గురించి ఓపెన్ అయిన రెజీనా..!

రెజీనా (Regina Cassandra) ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ వచ్చింది. సందీప్ కిషన్ (Sundeep Kishan) , సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) , రవితేజ (Ravi Teja) వంటి హీరోల సినిమాల్లో నటించింది. ఈమె కెరీర్లో హిట్ సినిమాలు ఉన్నప్పటికీ ఎందుకో స్టార్ డం సంపాదించుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు కూడా అడపాదడపా సినిమాలు చేస్తుంది కానీ.. ఏవీ కూడా ఆడటం లేదు. మరోపక్క డేటింగ్ రూమర్స్ తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది రెజీనా. గతంలో సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలతో ఈమె ప్రేమాయణం నడిపినట్టు ప్రచారం జరిగింది.

Regina Cassandra

తర్వాత ఈమె తెలుగులో సినిమాలు తగ్గించడంతో అవి నిజమే అని అంతా అనుకున్నారు. అయితే ‘ఉత్సవం’ (Utsavam) సినిమా ప్రమోషన్స్ లో వీటి గురించి ఓపెన్ అయ్యింది. రెజీనా తన రిలేషన్ షిప్స్ గురించి మాట్లాడుతూ… “14 ఏళ్లకే నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. ఓ పక్క చదువుకుంటూనే సినిమాల్లో కూడా నటించేదాన్ని. కాలేజీ టైంకి సినిమానే కెరీర్‌ అనుకున్నాను. చాలా కష్టాలు.. అవమానాలు ఎదుర్కొన్నాను. ఒక దశలో ఈ ఇండస్ట్రీ నాకు వద్దు అనుకున్నాను.

కానీ వెనకడుకు వేయలేని పరిస్థితి. ఆ టైంలో బలంగా నిలబడ్డాను. అందుకే ఈరోజు ఇలా ఉండగలిగాను. ఇక నేను పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయి కూడా నాలాగే ఉండాలి అనుకుంటున్నాను. బాధ్యతగా ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి అనేది నా కోరిక. నా జీవితంలో చాలా రిలేషన్ షిప్స్ ఉన్నాయి. నేనో సీరియల్ డేటర్.కానీ ఇప్పుడైతే రిలేషన్ షిప్స్‌కు దూరంగా ఉన్నాను. ఈ విషయాల్లో దాచడానికి ఏమీ లేదు. సందీప్ కిషన్… నేను ‘టామ్ అండ్ జెర్రీ’ వంటివాళ్ళం.

మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. 2012 నుండి మా మధ్య మంచి బాండింగ్ ఉంది. కానీ మా గురించి ఏవేవో ప్రచారం అయ్యాయి. సాయి ధరమ్ తేజ్ తో కూడా అంతే..! అతను వెరీ కామ్ అండ్ స్వీట్ పర్సన్” అంటూ చెప్పుకొచ్చింది. అయిన తాను డేటింగ్ చేసిన వాళ్ళ పేర్లు మాత్రం బయటపెట్టలేదు.

 ‘దేవర’ ముందు నిలబడే సినిమానా ఇది.. టీజర్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus