Regina: నేను గర్భవతిని అని చెప్పడంతో.. రెజీనా షాకింగ్ కామెంట్స్ వైరల్..!

సుధీర్ బాబు హీరోగా నటించిన ఎస్.ఎం.ఎస్(‘శివ మనసులో శృతి’) చిత్రంతో టాలీవుడ్‌కు పరిచమైన రెజీనా … ఆ తర్వాత సందీప్ కిషన్ తో ‘రొటీన్‌ లవ్‌ స్టోరీ’ ‘రారా కృష్ణయ్య’, అల్లు శిరీష్ తో ‘కొత్త జంట’, సాయి ధరమ్ తేజ్ తో ‘పిల్లా నువ్వు లేని జీవితం’, రవితేజ తో ‘పవర్‌’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది.అయితే అటు తర్వాత ఈమెకు అవకాశాలు తగ్గాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని ‘ఎవరు’ అనే చిత్రం చేసింది.

ఆ సినిమా హిట్ అయినా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. ఇటీవల ఈమె ‘అన్యాస్‌ ట్యుటోరియల్‌’ వెబ్‌ సీరిస్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతున్న ఆ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక దీని ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తాను గతంలో గర్భవతిని అనే అబద్ధం చెప్పినట్టు షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. “నాకు ‘మిస్టీ దోయ్’ అనే స్వీట్ అంటే చాలా ఇష్టం.

స్వీట్ తిందామని రాత్రి సమయంలో షాప్ దగ్గరకు వెళ్లాను. అయితే అప్పుడే ఆ స్వీట్‌ షాప్‌ కట్టేస్తున్నారు. నేను ఆ షాప్‌ అతన్ని స్వీట్‌ కావాలని అడిగాను.కానీ అతను షాప్‌ కట్టేస్తున్నాము అని చెప్పాడు. అప్పుడు నేను ప్రగ్నెంట్‌ అని, మిస్టీ దోయ్ స్వీట్ తినాలనిపిస్తుంది అని అతనితో అన్నాను.ఆ అబద్ధాన్ని నమ్మేసి అతను షాప్ తెరిచి మరీ నాకు ఆ స్వీట్ ఇచ్చాడు.

ఇలా ఒక స్వీట్ కోసం నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాల్సి వచ్చింది” అంటూ రెజీనా చెప్పుకొచ్చింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రంలో ‘సానా కష్టం’ అనే ఐటెం సాంగ్ లో రెజీనా ఆడి పాడిన సంగతి తెలిసిందే.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus