తెలుగులో తక్కువ సినిమాలే చేసినా ఆ సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న హీరోయిన్లలో రెజీనా ఒకరు. ఒకవైపు గ్లామర్ రోల్స్ లో మరోవైపు విభిన్నమైన కథలలో నటిస్తూ రెజీనా వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అలీతో సరదాగా షోలో రెజీనా మాట్లాడుతూ తమిళంలో నేను నటించిన తొలి సినిమా కేడి బిల్లా కిలాడి రంగ అని తెలిపారు. ఆ సినిమాలో శివ కార్తికేయన్ తో కలిసి నటించానని ఆ సినిమాలో నా పాత్ర పేరు పాప అని రెజీనా తెలిపారు.
ఆ పాత్ర ఊహించని స్థాయిలో పాపులర్ కావడంతో చెన్నైలో నన్ను ఇప్పటికీ పాప అని పిలుస్తారని ఆమె చెప్పుకొచ్చారు. నాన్న ముస్లిం అమ్మ క్రిస్టియన్ అని రెజీనా వెల్లడించారు. ఆరు సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో తల్లీదండ్రులు విడిపోయారని ఆమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అమ్మ మళ్లీ క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యి నా పేరులో కసాండ్రా జత చేశారని రెజీనా కామెంట్లు చేశారు. కాండ నాల్ ముదు తమిళ సినిమా తొలి సినిమా అని ఆమె అన్నారు.
ఎస్.ఎమ్.ఎస్. హీరోయిన్ గా తెలుగులో నటించిన తొలి సినిమా అని ఆమె చెప్పారు. నేను నటించిన షార్ట్ ఫిల్మ్ వైరల్ కావడంతో ఆ సినిమాలో ఛాన్స్ దక్కిందని రెజీనా పేర్కొన్నారు. కన్నడ, హిందీ భాషల్లోని సినిమాలలో కూడా నేను నటించానని రెజీనా చెప్పుకొచ్చారు. ఫస్ట్ నుంచి నేను డామినేటింగ్ అని ఆమె తెలిపారు. అమ్మాయిలు అతిశుభ్రత పాటించాలని అప్పుడే కొన్ని ఇబ్బందులు ఎదురుకావని ఆమె చెప్పుకొచ్చారు.
దోశ అంటే నాకు చాలా ఇష్టమని మూడుపూటలా దోశ తినాలని చెప్పినా తినేస్తానని రెజీనా పేర్కొన్నారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ నాకు నచ్చిన తెలుగు హీరోలని ఆమె చెప్పుకొచ్చారు. రజనీకాంత్ నా ఆల్ టైం ఫేవరెట్ అని ఆమె కామెంట్లు చేశారు. రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని కోరిక అని రాజమౌళి తీసే సినిమాలలో నటనకు ఆస్కారం ఉంటుందని ఆమె కామెంట్ చేశారు.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!