2022 లో వచ్చిన ‘డిజె టిల్లు’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి విమల్ కృష్ణ దర్శకుడు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందిన సంగతి తెలిసిందే. ‘టిల్లు స్క్వేర్’ పేరుతో రూపొందిన ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకుడు. వాస్తవానికైతే ఫిబ్రవరి 9న ఈ సినిమా రిలీజ్ కావాలి.
కానీ రవితేజ ‘ఈగల్’ సినిమా కోసం వాయిదా వేశారు. అయితే కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం.. మార్చి 30న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.దాదాపు ఈ డేట్ ని కన్ఫర్మ్ చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అయితే ఏప్రిల్ 5న ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న ‘దేవర పార్ట్ 1’ రిలీజ్ కాబోతుంది.
ఆ సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పైగా అది పాన్ ఇండియా సినిమా. దాదాపు 2 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ నుండి రాబోతున్న సినిమా. సో దానికి ఎక్కువ థియేటర్లు కేటాయించాలి. అలాంటప్పుడు ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) కి కేవలం 6 రోజులు సరిపోతుందా? 6 రోజుల్లో బిజినెస్ మొత్తం రికవరీ చేసుకోగలదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.