The Rajasaab: రాజా సాబ్ డేట్ మారితే.. ఆ ముగ్గురికి లక్కీ ఛాన్స్!

ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ సినిమా ‘రాజా సాబ్'(The Rajasaab)  గురించి టాలీవుడ్ లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మారుతి (Maruthi Dasari) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కాబోతోందని మేకర్స్ ప్రకటించినప్పటికీ, ఇప్పుడు ఆ డేట్ మారుతుందని టాక్ వినిపిస్తోంది. సమ్మర్ గోల్డెన్ టైమ్ కాబట్టి ప్రభాస్ రాకపోతే ఆ డేట్ ను క్యాష్ చేసులోవాలి అని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ వాయిదాకు ప్రధాన కారణం సిద్ధు జొన్నలగడ్డ  (Siddu Jonnalagadda)  ‘జాక్’ అనే సినిమా ఎనౌన్స్ మెంట్.

The Rajasaab

బొమ్మరిల్లు భాస్కర్ (Bhaskar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఏప్రిల్ 10న విడుదలవుతుందని ప్రొడక్షన్ టీం ఇటీవలే వెల్లడించింది. రాజా సాబ్ వాయిదా పడుతుందని జాక్ మేకర్స్ కి తెలియడంతో ఆ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ సినిమా విడుదల తేదీపై క్లారిటీ రాకుండా పోయింది. ఇక, ‘రాజా సాబ్’ వాయిదా పడడానికి ప్రధాన కారణం వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడం.

ప్రభాస్ ఇటీవల గాయపడిన విషయాన్ని కూడా ప్రకటించడం వలన మరికొంత సమయం అవసరమవుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాస్, త్వరలోనే షూటింగ్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో మరో రెండు చిత్రాలు కూడా ఏప్రిల్ 10 తేదీని టార్గెట్ చేస్తున్నాయట. నితిన్ నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమా కూడా అదే డేట్ ను టార్గెట్ చేసింది.

అలాగే బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘జాట్’ మరొకటి. ‘జాట్’ను కూడా ‘రాజా సాబ్’ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే నిర్మిస్తోంది. దీంతో, ‘రాజా సాబ్’ వాయిదా పడితే ‘జాట్’ను ఆ తేదీకి ప్లాన్ చేయాలని నిర్మాత విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) భావిస్తున్నట్లు టాక్. నితిన్ (Nithiin) ప్రస్తుతం ‘రాబిన్ హుడ్’ ’ (Robinhood)  ‘తమ్ముడు’ అనే రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ‘తమ్ముడు’ (Thammudu) ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధమవుతుండగా, ‘రాబిన్ హుడ్’ను శివరాత్రి లేదా ఏప్రిల్ 10న విడుదల చేయాలని నిర్మాతలు చూస్తున్నట్లు సమాచారం.

ప్లాన్ మార్చిన బన్నీ.. త్రివిక్రమ్ కథ ఆలస్యంగానే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus