రాక రాక పవన్ వస్తుంటే పరిస్థితి ఇలా తయారైంది ఏమిటీ?

  • March 17, 2020 / 06:17 PM IST

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో స్ట్రాంగ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. వకీల్ సాబ్ పవన్ కమ్ బ్యాక్ మూవీగా తెరకెక్కుతుంది. హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు చేరింది. పవన్ కళ్యాణ్ మొదటిసారి లాయర్ రోల్ చేస్తుండగా సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. ఐతే ఈ మూవీ అనుకున్న ప్రకారం మేలో విడుదలయ్యే పరిస్థితి కనబడడం లేదు. కరోనా వైరస్ కారణంగా అన్ని చిత్రాల షూటింగ్స్ మే 31వరకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాబట్టి మిగిలిన షూటింగ్ పార్ట్ మే లోపు పూర్తయ్యే అవకాశం లేదు.

ఇక ఈ మూవీలో హీరోయిన్ ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. అనగా పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ సన్నివేశాలు అలాగే ఓ సాంగ్ చిత్రీకరించాల్సివుంది. నిజానికి చిత్ర యూనిట్ మార్చి చివరికల్లా షూటింగ్ పార్ట్ పూర్తి చేసి, ఏప్రిల్ కి నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి మే 15న విడుదల చేయాలని భావించారు. ఒక వేళ షూటింగ్ మరియు నిర్మాణంతర కార్యక్రమాలు పూర్తయినా కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి రాని పక్షంలో మరో కొద్దినెలలు పెద్ద సినిమాల విడుదల ఉండకపోవచ్చు. కాబట్టి వకీల్ సాబ్ మే నెలలో విడుదల కావడం అనేది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. రెండేళ్లకు పైగా పవన్ ని సిల్వర్ స్క్రీన్ పై మిస్సయిన ఫ్యాన్స్ కి ఈ పరిణామాలు నిరాశపరుస్తున్నాయి.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus