మరోమారు సంచలన కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైఫ్ పార్టీ పుట్టకముందు.. తర్వాత అన్ని రీతిన మారిపోయింది. జనసేన పార్టీని స్థాపించి విస్తరించే దిశలో నడుముబిగించిన సమయంలో విమర్శలు చేస్తున్నారు.. విమర్శలను ఎదుర్కుంటున్నారు. అతని అభిమానులకు, యాంటీ అభిమానులకు మధ్య పవన్ కంటే అతని రెండో భార్య రేణు దేశాయ్ ఎక్కువగా నలిగిపోతున్నారు. రేణు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత విమర్శలను తట్టుకోలేక ట్విట్టర్ నుంచి బయటికి వెళ్లారు. అయినా ఆమెకు తిప్పలు తప్పడం లేదు. దానిపై ఆమె నేడు పేస్ బుక్ వేదికపై స్పందించారు. “నా జీవితం ప్రశాంతంగా ఉండడానికి కేవలం ఇన్‌స్టాగ్రామ్‌నే వాడాలని అనుకున్నాను. కానీ జీవితంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. గత ఐదేళ్లుగా నన్ను అనరాని మాటలు అంటున్న వారి గురించి పట్టించుకోవద్దని కొందరు నాకు సలహా ఇచ్చారు. నా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి నా కోసం నేను మాట్లాడుతుంటే అన్నీ మౌనంగా భరించాలని చెప్పారు.

పాపులారిటీ కోసమే ఇదంతా చేస్తున్నానని మరికొందరు అన్నారు. ఇప్పుడేమో ఓ నీచుడు పవన్‌ ఫోటోలను సోషల్‌మీడియాలో పెడుతూ నెగిటివ్‌ కామెంట్లు చేస్తున్నాడు. కొందరేమో పవన్‌ కల్యాణ్‌ను సపోర్ట్ చేయాలని మర్యాదపూర్వకంగా అడుగుతుంటే మరికొందరు బెదిరిస్తున్నారు. ఆయనకొక రూల్‌, నాకొక రూలా? గత ఐదేళ్లుగా కొందరు నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నప్పుడు నా ఆత్మాభిమానం మీకు ముఖ్యం అనిపించలేదా? నోరుమూసుకుని అన్నీ భరించమని నాకు సలహాలు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు పవన్‌ పేరుకు మచ్చ వస్తుందని నన్ను స్పందించమని అడుగుతున్నారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న ఈ సమాజంలో ఉంటున్నందుకు చాలా బాధగా ఉంది. నేనెప్పుడూ పవన్‌ గురించి తప్పుగా మాట్లాడను. అలా మాట్లాడమని నన్ను కానీ నా పిల్లలను కానీ ఏ రాజకీయ పార్టీ ప్రేరేపించలేదు” అని అనేక ప్రశ్నలకు ఒకేసారి సమాధానం చెప్పారు. మరి దీనిపై ఇంకెన్ని విమర్శలు పుట్టుకొస్తాయో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus