Renudesai: పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదు!

సినీ నటుడు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా నటి రేణు దేశాయ్ అందరికీ ఎంతో సుపరిచితమే. పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడి ఆయనను వివాహం చేసుకున్న అనంతరం ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా పవన్ నుంచి విడిపోయినటువంటి రేణు దేశాయ్ పిల్లల బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ తిరిగి సినిమాలలో బిజీ అయ్యారు.ఇకపోతే పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత పలు సందర్భాలలో ఈమె పవన్ గురించి విమర్శలు చేశారు

అయితే ఉన్నఫలంగా పవన్ కళ్యాణ్ కి తన మద్దతు అంటూ సోషల్ మీడియా వేదికగా (Renudesai) రేణు దేశాయ్ చేస్తున్నటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ సందర్భంగా రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పవన్ రాజకీయాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని చాలామంది మూడు పెళ్లిళ్లు స్టార్స్ అని ప్యాకేజీ స్టార్స్ అని అంటున్నారు. అయితే ఆయన డబ్బు మనిషి కాదు…

కేవలం పేదల సంక్షేమం కోసమే రాజకీయాలలోకి వచ్చారు. అందుకే తన రాజకీయం మొదలు పెట్టిన మొదటి రోజు నుంచి తన మద్దతు ఆయనకే ఉందని ఈ సందర్భంగా రేణు దేశాయ్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా కాకుండా ఒక సామాన్యమైన వ్యక్తిలా తాను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అంటూ ఈమె తెలియజేశారు.

అదేవిధంగా పిల్లల గురించి కూడా మాట్లాడుతూ…చాలామంది తమ పిల్లలను రాజకీయాలలోకి లాగుతున్నారు దయచేసి వారిని రాజకీయాలలోకి లాగొద్దండి వారికి వారి చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియదు అంటూ పిల్లలకు స్వేచ్ఛని ఇవ్వాలని తెలిపారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus