Renu Desai: బీచ్ లో ఎంజాయ్ చేస్తూ తెగ సిగ్గు పడిపోతున్న రేణు దేశాయ్!

సినీ నటి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే తన పిల్లల గురించి పవన్ కళ్యాణ్ అభిమానులు ఏదైనా ప్రశ్నిస్తే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఏప్రిల్ 8వ తేదీ ఆకీరా పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు, రేణు దేశాయ్ మధ్య సోషల్ మీడియా వార్ జరిగిన విషయం మనకు తెలిసిందే.

ఇలా పవన్ కళ్యాణ్ అభిమానులకు రేణు దేశాయ్ మధ్య ఈ విధమైనటువంటి వివాదాలు తలెత్తడం కొత్తేమి కాదు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా తనదైన స్టైల్ లో సమాధానం చెబుతూ ఉంటారు.ఇక తన పిల్లలతో కలిసి ఒంటరిగా ఉన్నటువంటి రేణు దేశాయ్ తరచూ పిల్లలతో కలిసి వెకేషన్ వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా రేణు దేశాయ్ వెకేషన్ వెళ్ళినట్టు తెలుస్తుంది. సరదాగా తన కుమార్తె ఆద్యతో కలిసి సముద్ర తీరాన ఎంజాయ్ చేస్తూ సందడి చేశారు.

అందుకు సంబంధించిన వీడియోని రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. సముద్రపు అలలు రేణు దేశాయ్ ని తాకుతూ ఉండగా ఈమె ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తనకు వీడియో తీయొద్దు అంటూ చెబుతున్నప్పటికీ ఈ వీడియో తీసినట్టు తెలుస్తుంది. ఇలా రేణు దేశాయ్ వీడియో తీయొద్దు అంటున్న తనకు వీడియో తీసినది మరెవరో కాదు రేణు దేశాయ్ కూతురు ఆద్య.

రేణు దేశాయ్ వీడియో తీయదని చెబుతున్న ఆమె తన తల్లి సంతోషాన్ని ఇలా బంధించేశారు. ప్రస్తుతం రేణు దేశాయ్ షేర్ చేసినటువంటి ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే.


శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus