2017 ప్రథమార్ధంలో వచ్చిన తెలుగు సినిమాల విజయాలపై రివ్యూ

తెలుగు చిత్రపరిశ్రమకు 2017 బాగానే కలిసి వచ్చింది. సంక్రాంతి సీజన్ కి వచ్చిన ఖైదీ నంబర్ 150 , గౌతమి పుత్ర శాతకర్ణి, శతమానం భవతి మూడు సినిమాలు విజయం సాధించి మంచి ఉత్సాహం ఇచ్చాయి. వేసవి సెలవులకు వచ్చిన బాహుబలి కంక్లూజన్ అన్ని రికార్డులను బద్దలు కొట్టి భారీ బడ్జెట్ సినిమాలకు స్ఫూర్తిని ఇచ్చింది. ఇలా కలెక్షన్లు, రికార్డులతో ప్రథమార్ధం సంతోషంగానే ముగిసింది. ఈ ఆరు నెలల్లో విడుదలైన తెలుగు సినిమాల విజయాలపై రివ్యూ..

ఖైదీ నంబర్ 150 మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత ‘ఖైదీ నంబర్ 150’ రూపంలో సంక్రాంతికి బరిలోకి దిగారు. జనవరి 11 న వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. 150 కోట్ల పైన కలక్షన్స్ సాధించి చిరు సత్తాని చాటింది.

గౌతమిపుత్ర శాతకర్ణిజనవరి 12 న నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ రిలీజ్ అయింది. బాలయ్య డైలాగులు, యుద్ధ సన్నివేశాలు, కథలోని ఎమోషన్… ఇవన్నీ ఆకట్టుకోవడంతో ‘శాతకర్ణి’ చక్కటి విజయాన్ని సొంతం చేసుకోగలిగింది.

శతమానం భవతిటాలీవుడ్ కి 2017 లో హ్యాట్రిక్ హిట్ శతమానం భవతి రూపంలో వచ్చింది. జనవరి 14వ తేదీన విడుదలయిన ‘శతమానం భవతి’ కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకొని విజయాన్ని సొంతం చేసుకుంది.

నేను లోకల్గత ఏడాది వరుస హిట్లు అందుకున్న నాని ఈ సంవత్సరం కూడా విజయంతోనే మొదలెట్టారు. ఫిబ్రవరి 3న ‘నేను లోకల్’ అంటూ వచ్చిన నానిని ప్రేక్షకులు ఆశీర్వదించారు. నేచురల్ గా హిట్ ఇచ్చారు.

ఘాజీ దగ్గుబాటి రానా చేసిన ప్రయోగాత్మక చిత్రం ఫిబ్రవరి 17 న రిలీజ్ అయి కలెక్షన్లతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రానా సాహసం మంచి పేరుని తెచ్చి పెట్టింది.

గురు ‘సాలా ఖడూస్’కి రీమేక్ గా వచ్చిన ‘గురు’ మార్చి 31 న విడుదలై భావోద్వేగాల్ని పండించి అలరించింది. విక్టరీ వెంకటేష్ మరో రీమేక్ హిట్ సొంతం చేసుకున్నారు.

బాహుబలి కంక్లూజన్ 2017 సినీ క్యాలెండర్లో ‘బాహుబలి: ది కన్క్లూజన్’ కి ప్రత్యేక స్థానం ఉంది. ఏప్రిల్ 28 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ భారత సినిమా రికార్డులకు కొత్త టార్గెట్ ని ఫిక్స్ చేసింది. కనీవినీ ఎరుగని వసూళ్లతో ఆశ్చర్యపరిచింది. ‘ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ’గా తన పేరు నమోదు చేయించుకొంది.

కేశవవైవిధ్యమైన కథలతో దూసుకుపోతోన్న నిఖిల్ చేసిన మూవీ కేశవ. సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం మే 19 న థియేటర్లోకి వచ్చి వినోదాన్ని పంచింది. నిర్మాతకు మంచి లాభాలను అందించింది.

రారండోయ్ వేడుక చూద్దాంప్రేమ కథ చిత్రాలతో పలకరించే నాగ చైతన్య ఈసారి కుటుంబ కథతో ముందుకొచ్చారు. అన్నపూర్ణ బ్యానర్లో అతను చేసిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించింది.

అమీ తుమీ‘జూన్’లో విడుదలైన ఇంద్రగంటి మోహనకృష్ణ చిత్రం ‘అమీ తుమీ’ ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. కంటెంట్ ఉంటే చిన్న సినిమానైనా ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు ‘అమీ తుమీ’తో మరో సారి నిరూపించారు.

డీజే హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం “దువ్వాడ జగన్నాథమ్” మిశ్రమ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలక్షన్స్ భారీగానే వసూలు చేసింది. 2017 ఫస్టాఫ్ కి ద్విగ్విజయంగా ముగింపు పలికింది.

అలా.. అనేక విజయాలతో కొన్ని ప్లాఫ్ లతో 2017 ఫస్టాఫ్ ముగిసింది. సెకండాఫ్ లో కూడా పెద్ద సినిమాల హడావుడి కనిపించబోతోంది. ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ ద్వితీయార్ధంలో రానున్నాయి. ఇవి కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus