నిత్యం వివాదాలతో సావాసం చేసే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది రామ్ గోపాల్ వర్మ మాత్రమేనని చిన్న పిల్లాడి దగ్గర్నుంచి పండు ముసలి వాళ్ళ వరకు తెలియని వాళ్ళు ఉండరు.ఎప్పుడు ఏదో ఒక వివాదంలోనో, ఏదో ఒక సంచలన కామెంట్స్ ద్వారానో,వార్తల్లో నిలిచే వర్మ తాజాగా మరో సంచలన కామెంట్స్ తో సినీ ప్రేమికుల్నందర్నీ విస్మయానికి గురిచేశాడు.తెలుగులో బెజవాడ బెబ్బులిగా ఒకప్పుడు వెలుగు వెలిగిన వంగవీటి మోహనరంగా జీవిత ఆదారంగా తను తీసే
‘వంగవీటి’ చిత్రం తెలుగులో తన ఆఖరి చిత్రం అని వర్మ ప్రకటించేసాడు.
ప్రస్తుతం ‘వంగవీటి’ చిత్ర స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న వర్మ ఇక తన కెరీర్లో వంగవీటి కంటే అద్భుతమైన కథ దొరకదని నాకు కచ్చితంగా తెలుసని, తెలుగులో ‘శివ’ చిత్రంతో మొదలైన తన సినిమా కెరీర్ వంగవీటి చిత్రంతో తెలుగులో ముగుస్తుందని చెప్పుకొచ్చాడు. తను చేసిన రక్తచరిత్రకి మరియు చేయబోయే ‘వంగవీటి’ చిత్రానికి మధ్య తేడా ఫ్యాక్షనిజం, రౌడీయిజానికి మధ్య తేడా అని.., ఫ్యాక్షనిస్ట్ శత్రువే ప్రపంచంగా బతుకుతాడని.., కాని రౌడీ మాత్రం ప్రపంచమే శత్రువుగా బ్రతుకుతాడని రెండింటి మధ్య తేడా చెప్పాడు.
విజయవాడ సిద్దార్ధ కాలేజీ లో చదువుకొనే రోజుల్లోనే ప్రేమ, స్నేహం,గొడవలు,రాజకీయాలు,అన్నీ చూశానని విజయవాడ లో రౌడీయిజం గురుంచి తనకు తెలిసినంతగా విజయవాడ లో మరెవరికి తెలియదని, బల్ల గుద్ది మరీ ఎక్కడైనా చెబుతానని,అవసరమైతే కత్హి తో పొడిచి మరీ చెప్తాను అని అన్నాడు.