నంది అవార్డులపై వర్మ విడుదల చేసిన సాంగ్!

2014, 15, 16 ఆంద్రప్రదేశ్ నంది అవార్డుల ప్రకటనపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ అవార్డులపై వర్మ స్పందించడంతో మరింత మంట రాజుకుంది. వర్మ వేసిన సెటైర్లపై కమిటీ సభ్యుడు మద్దినేని రమేష్ ఘాటుగా సమాధానం ఇవ్వడంతో వర్మ ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్నారు. ఒక పాటను రాసి, అందుకు చాణిక్య చంద్రగుప్త చిత్రంలో జయమాలిని డ్యాన్స్ పాటని రీమిక్స్ చేసి తన ఫేస్ బుక్ పేజీలో ఈ వీడియో సాంగ్‌ని పోస్ట్ చేశారు. నందుల కమీటినీ, టీడీపీని, కమ్మ కులాన్ని పరోక్షంగా విమర్శిస్తున్న పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం అయింది. ఆ పాట లోని లిరిక్స్ ఎలా ఉన్నాయంటే…

‘‘ఒకటా రెండా తొమ్మిది.. మరి ఒకటే నేను నందిని
ఒకటా రెండా తొమ్మిది.. మరి ఒకటే నేను నందిని
ఎవరికి ఇవ్వాలి అవార్డు.. ఇక ఊపండి బాబు గిచ్చుడు..
అంకెలు చూస్తే తొమ్మిది.. మా కోరిక మాత్రం ‘కమ్మ’ది, మా కోరిక మాత్రం ‘కమ్మ’ది
ఎహే..వేయకే నీవు రంకెలు.. నీ కన్నా గొప్పది సైకిలు, నీ కన్నా గొప్పది సైకిలుగంగిరెద్దు లాగనన్ను చిన్నచూపు చూడకండి.. ఆ.. ఆ.. అమ్మోయ్..
గానుగెద్దు లాగనన్ను అక్కడక్కడే తిప్పకండి.. అబ్బ.. అబ్బ.. అబ్బో..
అహ్.. తట్టుకోలేను మీ విసురు… తగులుతుందయ్యో నా ఉసురు.. అయ్.. అయ్..
అహ్.. తట్టుకోలేను మీ విసురు… తగులుతుందయ్యో నా ఉసురు..
అడ్డువచ్చువాడు లేడు మాకు… పచ్చ జెండా ఊపుతాము మేము, పెద్ద పచ్చజెండా ఊపుతాము మేముఅ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ..
ఒకటా రెండా తొమ్మిది.. మరి ఒకటే నేను నందిని.. అయ్యో ఒకటే నేను నందిని..
సామి భక్తి కోసమేనా… ఇంత పెద్ద నంది కష్టం..
ఇష్టంవచ్చి నట్టుమీరు పంచుకోవడం మాకు ఇష్టం.. అబ్బ.. అబ్బ.. అబ్బబ్బ..
మాకు ఉన్న నొప్పులేవో మావీ.. మేము చెప్పినట్టు తల ఊపు నందిఇంకెందుకయ్యో ఈ నందులు.. ఎందుకో ఈ పిచ్చి చిందులు.. అబ్బ ఎందుకో ఈ పిచ్చి చిందులు..
అంకెలు చూస్తే తొమ్మిది.. మా కోరిక మాత్రం ‘కమ్మ’ది, మా కోరిక మాత్రం ‘కమ్మ’ది
‘కమ్మ’ది.. ‘కమ్మ’ది.. ‘కమ్మ’ది.. యాహ్..’’

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus