రామ్ గోపాల్ వర్మకి దొరికిన హీరో ఎవరో తెలుసా ?

శివ.. ఇది ఒక సినిమా టైటిల్ మాత్రమే కాదు. తెలుగు చిత్ర పరిశ్రమను మలుపుతిప్పిన చిత్రం. అప్పటి వరకు ఉన్న భయాలను.. మూస ధోరణిలను బద్దలు కొట్టిన మూవీ ఇది. రామ్ గోపాల్ వర్మ తీసిన తొలి చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ ఒక్క సినిమా వర్మ, నాగార్జునలతో పాటు ఎంతోమంది జీవితాలను సెట్ చేసింది. చాలాకాలం తర్వాత మళ్ళీ అటువంటి కాంబినేషన్లో సినిమా అనగానే క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. వర్మ ట్వీట్స్ ఆ క్రేజ్ ని మరింత పెంచుతుంటాయి. తాజాగా అతను చేసిన ట్వీట్ అందరి ద్రుస్తిని ఆకర్షించింది. ” ఈరోజు ఫిబ్రవరి 16. కొన్నేళ్ల క్రితం ఇదే రోజున శివ చిత్రీకరణ ప్రారంభించాను.

ఈ సందర్భంగా ఇప్పుడు నేను తీస్తున్న కొత్త చిత్రంలోని నా కొత్త హీరో నాగ్‌ స్టిల్‌ను పంచుకుంటున్నాను. 25 ఏళ్లు వెతికిన తరువాత నాకు ఓ కొత్త హీరో దొరికాడు. అతనే ఇప్పటివరకు చేయని రియలిస్టిక్‌ యాక్షన్‌ హీరోగా నటిస్తున్న నాగార్జున” అని వర్మ రెండు ఫోటోలను పోస్ట్ చేశారు. ఇవి సోషల్ మీడియాలో అనేక లైక్లు అందుకుంటున్నాయి. ముంబయిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి “గన్”, “సిస్టమ్‌” అనే పేర్లను పరిశీలిస్తున్నారు. మైరా సరీన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus