జక్కన్నకే సలహాలిస్తున్న వర్మ!!!

ఒకరు టాలీవుడ్ ను ప్రపంచానికి చూపించే దశలో అహర్నిశలూ కష్టపడుతున్న దర్శకుడు రాజమౌళి….మరొకరు నైట్ కి ఒక పెగ్ వేసి దొరికిన హీరోలను తన మాటలతో ఫూట్‌బాల్ ఆడుకునే దర్శకుడు….రామ్ గోపాల్ వర్మ….అవును వీళ్ళిద్దరి గురించి ఇప్పుడు ఒక టాపిక్ టాలీవుడ్ సర్కిల్స్ లో స్పెషల్ ఎంట్రెన్స్ తీసుకుంది….విషయంలోకి వెళితే…పవన్ కల్యాణ్ ‘కాటమరాయుడు’ విడుదల అయిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ను అదేవిధంగా పవన్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ వరసపెట్టి ట్విట్స్ చేస్తూ….తన పైశాచికత్వాన్ని ఇలా ప్రదర్శించినుకుంటున్నాడు వర్మ…

అదే క్రమంలో అసలే సినిమా డిజాస్టర్ అయ్యి బాధలో ఉన్న ఫ్యాన్స్ కి వర్మ పెద్ద తలపోటుగా మారడంతో ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు పవన్ ఫ్యాన్స్ కి…ఇదిలా ఉంటే నిన్నటి వరకూ పవన్ అండ్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేసిన వర్మ..ఇప్పుడు హఠాత్తుగా తన రూట్ మార్చి ఎవరూ కలలో కూడ ఊహించలేని తన వింత కోర్కెను బయట పెట్టాడు. ఈ కోరిక పవన్ అభిమానులకే కాదు ఏకంగా రాజమౌళికే షాక్ ఇచ్చే కోరికగా మారింది. రాజమౌళి పవన్ కళ్యాణ్ లు కలిసి ఒక సినిమాను చేస్తే తనకు చూడాలని ఉంది అని తన కోరికను వ్యక్త పరుస్తూ ఒక ఆసక్తికరమైన ట్విట్ చేసాడు వర్మ. అంతేకాదు అటువంటి అద్భుతం జరిగితే అది ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తుంది అంటూ వర్మ మరొక కొత్త చర్చలకు తెర తీసాడు.

ఇప్పటి వరకు పవన్ ఫ్యాన్స్ ను గేదెలతో పోల్చిన వర్మ స్టీవెన్ స్పీల్‌బర్గ్, జేమ్స్ కామెరాన్, క్రిస్టఫర్ నోలన్ లాంటి హాలీవుడ్ ప్రముఖులు ‘కాటమరాయుడు’ చిత్రాన్ని తమకు ప్రత్యేకంగా ప్రదర్శించాలని కోరుతున్నారు అంటూ షాకింగ్ ట్విట్స్ చేసిన వర్మ ఇప్పుడు ఇలా రాజమౌళికి ఇలాంటి ఉచిత సలహా ఇవ్వడం వెనుక వ్యూహం ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. అయితే మనకు వినడానికి కాస్త వెటకారంగా అనిపించినా….ఈ వాక్కు నిజం అయితే…నిజంగానే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్స్ లో టాప్ హిట్ గా నిలవడం ఖాయం అనే చెప్పాలి..ఇక మరో పక్క ఈ కాటమ రాయుడు సినిమా బయ్యర్స్ తీవ్ర నష్టాలు చవి చూడక తప్పదు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు…సినిమా కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ కావడంతో ఈ సినిమా మరో సర్దార్ గబ్బర్ సింగ్ అని చెప్పక తప్పదు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus