RGV: మీరు సుప్రీం కోర్టు తీర్పుని కూడా వ్యతిరేకించినట్టే: ఆర్జీవీ ఆవేదన!

రాంగోపాల్ వర్మ గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో చాలా కామ్ గా ఉంటున్నారు. నిజానికి ఇదివరకు కూడా కామ్ గానే ఉండే వారు కానీ, ఆయన ఆలోచన శైలి కానీ, కొన్ని అంశాలపై ఆయన స్పందించే విధానం కానీ,ఆయనకు నచ్చినట్టు తీసే సినిమాల విషయంలో కానీ, వాటిని పబ్లిసిటీ చేసే విషయంలో కానీ.. వివాదాలు తలెత్తేవి. వాటికి ఆర్జీవీ ఇచ్చే సమాధానాలు కూడా కరెక్ట్ గానే ఉండేవి కానీ.. రెచ్చిపోయేవాళ్ళు రెచ్చిపోయేవారు.

మొన్నటికి మొన్న ఆయన టికెట్ రేట్ల ఇష్యు గురించి వివరించిన విధానం అందరికీ నచ్చింది. అందుకు అందరూ ఫిదా అయిపోయారు. ఇటీవల ఆయన ట్వీట్లు కూడా బాగానే ఉంటున్నాయి. కానీ ఆయన తీసిన ‘డేంజరస్‌’ చిత్రం ఇప్పుడు ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఇది లెస్బియన్స్ కథాంశంతో కూడిన సినిమా. ఏప్రిల్ 8న ఈ మూవీ విడుదల కాబోతుంది. అయితే ఈ మూవీని ప్రదర్శించేందుకు పీవీఆర్‌, ఐనాక్స్‌ థియేటర్లు నిరాకరించాయి. ‘డేంజరస్‌’ ను మా థియేటర్లో ప్రదర్శించబోమంటూ తేల్చి చెప్పేసాయి.

దీంతో వర్మ సినిమాకి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈ విషయాన్ని ఆర్జీవీ తన ట్విట్టర్లో తెలియజేస్తూ ఆవేదన వ్యక్తం చేసాడు. ‘నేను తీసిన ‘డేంజరస్’ మూవీ లెస్బియన్ కథాంశంతో కూడుకున్నదని దానిని నిరాకరించడం సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకించడమే అవుతుంది. సెన్సార్ బోర్డు ఆమోదించిన సినిమాని నిషేధించడం ఎల్‌జీబీటీ(LGBT) కమ్యూనిటీకి వ్యతిరేకంగా వెళ్ళడమే.పీవీఆర్‌, ఐనాక్స్ యాజమాన్యాలు ప్రత్యక్షంగా ఎల్‌జీబీటీని వ్యతిరేకిస్తున్నారు అని తేలింది. ఈ కమ్యూనిటీ మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తారని నేను ఆశిస్తున్నా’ అంటూ వర్మ తన శైలిలో రాసుకొచ్చాడు.

ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది. మరి వర్మ ట్వీట్‌ పై పీవీఆర్‌, ఐనాక్స్‌ యాజమాన్యాల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus