వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాలంటేనే.. పెద్ద సంచలనాలు సృష్టిస్తుంటాయి. ఎన్నో గొడవలు, అల్లర్లు చోటు చేసుకునేలా చేసి తన సినిమాకి బాగా పబ్లిసిటీ తెచ్చుకుంటాడు వర్మ. చివరికి థియేటర్ కు వెళితే వర్మ రెచ్చగొట్టినంత మ్యాటర్ ఏమీ అక్కడ ఉండదు. అయినప్పటికీ వర్మ సినిమా చేసెయ్యాలి అనే క్యూరియాసిటీ మాత్రం అందరిలోనూ ఉంటుందనేది వాస్తవం అనే చెప్పాలి. ఇక వర్మ తాజా చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’.. అదే నండీ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్ మార్చారు కదా.
నవంబర్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు వర్మ. అయితే సెన్సార్ బోర్డ్ వారు ఈ చిత్రానికి క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో విడుదల నిలిచిపోయింది. అందుకు వర్మ సెన్సార్ వాళ్ళ పై నోరుకూడా పారేసుకున్నాడు. సరే ఈ చిత్రం సెన్సార్ పూర్తయ్యాకే విడుదల చేద్దాంలే అని వెయిట్ చేస్తున్న వర్మకి ఇప్పుడు సెన్సార్ బోర్డు సభ్యులు మరో షాక్ ఇచ్చారట. చాలా వరకూ ఈ చిత్రంలో మార్పులు చెయ్యాలని భావించిన సెన్సార్ వారు.. ఈ చిత్రాన్ని రివైజింగ్ టీం కు పంపించారట. వాళ్ళు సైతం ఈ చిత్రాన్ని 90శాతం మార్చాలని సూచించారట. వారి మాటలని బట్టి.. 902 శాతం మార్చాలంటే చాలా కష్టం. ఈ క్రమంలో ఆన్ లైన్ లో విడుదల చేస్తేనే బెటర్ అనే ఆలోచనకి వర్మ వచ్చేశాడని తెలుస్తుంది.
అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!