జైల్లో దుర్భర పరిస్థులు ఎదుర్కొంటున్న హీరోయిన్

ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయంటే బహుశా ఇదేనేమో. విలాసవంతమైన ఇల్లు, కార్లు, లగ్జరీలతో కింగ్ సైజ్ లైఫ్ అనుభవించిన రియా చక్రవర్తి పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. జైల్లో ఆమెకు కనీస సౌకర్యాలు కూడా లేనట్లు తెలుస్తుంది. డ్రగ్స్ కేసులో నార్కోటిక్ అధికారులచే అరెస్ట్ కాబడిన రియాను జైల్లో ఉంచారు. విచారణ నిమిత్తము ఆమెను 14రోజుల జ్యుడీషియల్ కస్టడీలోకి తీవుకోవడం జరిగింది. దీనిలో భాగంగా రియాను ముంబై బైకుల్లాలో గల జైలు నందు ఉంచారు. ఈ జైలులో రియా కొరకు కేటాయించిన గదిలో కనీస సౌకర్యాలు లేవట.

కనీసం ఒక ఫ్యాన్ కూడా ఆ గదిలో లేదట. చాప, దిండు వంటివి కూడా ఆమెకు అధికారులు అందించలేదట. నేలపైనే రియా పడుకున్నారని సమాచారం. మరో వైపు బైకుల్లా జైలులో కరోనా కేసులు అధికంగా ఉన్నాయట. ఈ నేపథ్యంలో రియా చాలా భయపడుతున్నారట. రియా జైలు గది దగ్గర ఇద్దరు పోలీసులు కాపలాగా ఉన్నారట. కోర్ట్ అనుమతించిన తరుణంలో ఆమెకు ఓ ఫ్యాన్ ఏర్పాటు చేస్తాం అని జైలు అధికారాలు చెప్పినట్లు సమాచారం.

ఇక రియా అరెస్ట్ అయిన వంటనే బెయిల్ కొరకు పిటీషన్ పెట్టుకున్నారు. రియా బెయిల్ పిటీషన్ కోర్ట్ కొట్టివేసింది. రియాకు డ్రగ్ డీలర్స్ తో సంబంధాలున్నాయని గట్టి ఆధారాలు లభించడంతో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. కాగా ఈ కేసులో మొత్తం 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు లిస్ట్ అవుట్ చేశారని తెలుస్తుండగా, రకుల్ ప్రీత్, సారా అలీఖాన్ పేర్లు బయటకు రావడం సంచలనం రేపుతుంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus