ఢిల్లీ బ్యూటీ రిచా గంగోపాధ్యాయ దగ్గుబాటి రానాతో కలిసి “లీడర్” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మిరపకాయ్, నాగవల్లి, భాయ్, సారొచ్చారు సినిమాల్లో నటించి తెలుగువారికి దగ్గరయింది. ప్రభాస్ తో మిర్చి సినిమాలో ఆడి పాడి ఆకట్టుకుంది. టాలీవుడ్ లో ఓ గుర్తింపును సంపాదించుకుంది. అవకాశాలు వస్తున్న సమయంలో మంచి ఆఫర్లను సైతం పక్కన పెట్టి పై చదువుల కోసం అమెరికా వెళ్ళింది. వాషింగ్టన్ యూనివర్సిటీలో రిచా ఎంబీఏ పూర్తిచేసింది. స్టడీ అయిపోయిందిగా ఫిలిం ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఎప్పుడు అని అడిగితే షాక్ ఇచ్చింది. ఇక తాను సినిమాలో నటించనని స్పష్టం చేసింది.
”నేను ఐదేళ్ల క్రితమే( 2013 ) ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేశా. ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టా” అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. దీంతో రిచా అభిమానులు నిరాశపడ్డారు. ఏదొక సినిమా తళుక్కున మెరవబోతుందా? అని ఆశపడుతున్నారు. చూద్దాం ఏ డైరక్టర్ ఆమెను ఒప్పిస్తారో..!