బీచ్‌లో బ్యూటీ ట్రీట్ ఇస్తున్న రీతూ చౌదరి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • November 22, 2022 / 01:18 PM IST

సోషల్ మీడియాలో మ్యారీడ్ అన్ మ్యారీడ్ అనే తేడా లేకుండా ముద్దుగుమ్మలంతా ఫోటోషూట్లతో కుర్రకారు మతిపోగొడుతున్నారు. సిల్వర్ స్క్రీన్ స్టార్లకు మేమేమాత్రం తక్కువ కాదన్నట్టు హంగామా చేస్తున్నారు స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలు.. యాంకర్ రష్మీ, దీపిక పిల్లి లాంటి బ్యూటీస్ మాల్దీవుల్లో సందడి చేస్తున్నారు. బుల్లితెర సెలబ్రిటీల్లో రీతూ చౌదరి రూటే సపరేటు.. అచ్చతెలుగు అమ్మాయే అయినా అందరూ ఆశ్చర్యపోయేలా అందాల విందు చేస్తుంటుంది. రీతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే.

ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ అండ్ వీడియోస్‌తో నెటిజన్లను అలరిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాతో పాటు టెలివిజన్ ఫీల్డ్‌లోనూ పిచ్చ పాపులర్ అయింది. సీరియల్స్‌తో పాటు షోలతోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఎంతమంది యంగ్ యాంకర్స్ ఉన్నా కూడా కుర్రాళ్ల అటెన్షన్ అంతా ఆమె మీదే ఉంటుంది. అది ఎందుకనేది కొత్తగా చెప్పక్కర్లేదు..ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్‌ని ఇంట్రడ్యూస్ చేయడంతో.. కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

కొద్దికాలంగా అతనితోనే హాలీడే ట్రిప్స్ అవీ వేస్తూ ఉంది. రీసెంట్‌గా బీచ్‌లో ట్రెండీ వేర్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఆ బీచ్ ఎక్కడనేది చెప్పలేదు.. మా ఫోకస్ అంతా రీతూ మీద ఉంటే.. ఇక మాకు ప్లేస్‌తో పనేముంది అంటూ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్లు. ఇప్పుడు రీతూ చౌదరి లేటెస్ట్ బీచ్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus