మొన్నీమధ్య ‘లోకా చాప్టర్ 1’ అంటూ ఓ సినిమా వచ్చింది. అందులో హీరోయిన్ సూపర్ పవర్స్ ఉన్న యువతిగా కనిపించి అలరించింది. వసూళ్లు కూడా భారీగానే సాధించింది. ఇప్పుడు మరో సూపర్ గర్ల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమెనే రితికా నాయక్. తేజ సజ్జా – కార్తిక్ ఘట్టమనేని – మంచు మనోజ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘మిరాయ్’ సినిమాలో రితికా సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయిగా కనిపించనుంది. ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ సినిమాలో రితికా.. హిమాలయాల్లో ఉండే ఒక సన్యాసిలా కనిపిస్తుందట. ఆ పాత్ర ప్రయాణం ఏమిటన్నది సినిమాలో కీలకంగా ఉంటుందట. నిజ జీవితానికి భిన్నమైన పాత్రలో రితికా కనిపిస్తుందట. ఎందుకంటే ఆమె బయట ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అంతటి టాకటివ్ పర్సన్‌ని కామ్‌గా ఉండే పాత్రలో చూపించబోతున్నారు ఈ సినిమాలో. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని సినిమా సెట్‌లో రితికను అక్క అని పిలిచేవారట. ఆమె తమ్ముడు అని పిలిచేదట. ఎందుకంటే ఆమె పుట్టినరోజు అక్టోబరు 27, కార్తిక్‌ది అక్టోబరు 28.
ఇయర్‌తో సంబంధం లేకుండానే ఒక రోజు ముందుగా పుట్టాను కాబట్టి నన్ను అక్క అని కార్తిక్ ఘట్టమనేని పిలిచేవారని రితికా చెప్పింది. ఇక హీరోయిన్లలో సాయిపల్లవి నటనని ఇష్టపడతానని చెప్పి రితికా.. ఆమె కళ్లతోనే భావాలు పలికించే తీరు చూసి ముచ్చటగా ఉంటుందని చెబుతూ మురిసిపోయింది. ‘ఫిదా’ సినిమా చూశాక కథానాయికగా ఆమెను స్ఫూర్తిగా తీసుకున్నానని తెలిపింది.
ఇక రాబోయే సినిమాల సంగతి మాట్లాడుత.. వరుణ్ తేజ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు తెలిపింది. అలాగే ‘డ్యూయెట్’ అనే మరో సినిమా కూడా చేస్తోంది. మరికొన్ని ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయని, త్వరలో అనౌన్స్ అవుతాయని తెలిపింది. తెలుగులో బాగానే మాట్లాడుతున్నారు కదా అని అడితే.. అవును తెలుగు 90 శాతం అర్థమవుతోందని, మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాని చెప్పింది. నెక్స్ట్ సినిమాల్లో నేనే డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాను అని కూడా చెప్పింది.