రజినీకాంత్, అమీజాక్సన్ జంటగా, అక్షయ్ కుమార్ విలన్ గా, శకంర్ దర్శకత్వంలో, లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన సినిమా 2.O. దాదాపుగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్, పాటలకి, ట్రైలర్ కి ప్రేక్షకుల్లో విశేష ఆదరణ లభించింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తిచేసుకోగా సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ను జారీచేసింది.
ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు, సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరెకెక్కిన ఈ సినిమా విజువల్ వండర్ అని, సినిమాలో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రత్యేక 3d ఫార్మాట్ లో శకంర్ చూపించిన విధానానికి సెన్సార్ బోర్డు ఫిదా అయిందట. అంతేకాకుండా ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిందంటూ అభినందించారట. మరి డైరెక్టర్ శంకర్, హీరో రజినీకాంత్, మ్యూజిక్ డైరక్టర్ ఏఆర్. రెహమాన్ కాంబినేషన్ ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొడుతుందో తెలియాలంటే ఈ నెల 29 వరకు కాస్త వెయిట్ చేయక తప్పదుమరి.