Roshan, Suma: సుమ వస్త్రధారణ పై రోషన్ సెటైర్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సుమ కనకాల ఒకరు. ఈమె గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొనసాగుతూ ఉన్నారు. ఒకప్పుడు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఏదైనా ఒక సినిమా విడుదల అయింది అంటే స్టార్ హీరోల సినిమా నుంచి మొదలుకొని యంగ్ హీరోల సినిమాల వరకు సుమా యాంకర్ గా వ్యవహరించాల్సిందే.

ఇలా వరుస ఈవెంట్లతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ఇటీవల తన కుమారుడు రోషన్ కూడా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా సుమ తన కొడుకు ఇద్దరు కూడా బిగ్ బాస్ సోహెల్ హీరోగా నటించిన బూట్ కట్ బాలరాజు సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమ కాస్తా స్టైలిష్ డ్రెస్ లో కనిపించారు.

ఇక ఈ వేదికపై సుమ కుమారుడు రోషన్ సుమా పరువు మొత్తం తీసేసారు. వేదిక పైకి వెళ్లిన రోషన్ ఇక్కడ మా అమ్మ ఉండాలి గుర్తుపట్టారా అంటూ స్వయంగా సుమని వెళ్లి అడిగారు. అనంతరం అమ్మ ఇక్కడ నువ్వేనా గుర్తుపట్టలేకపోయాను ప్యాంట్ నీ గెటప్ భలే ఉంది అంటూ సెటైర్లు వేశాడు.

నిన్ను ఈ గెటప్ లో చూసేసరికి గుర్తుపట్టలేకపోయానని చాలా కొత్తగా ఉన్నావు అంటూ ఆమె వస్త్రధారణ పై కామెంట్స్ చేయక ఒక్కసారిగా నన్నే గుర్తుపట్టలేకపోయావా ఇంటికి రారా నీ సంగతి చెబుతా అంటూ కామెంట్ చేశారు. మీ నాన్నే నా డ్రెస్ గురించి కామెంట్స్ చేయరు అంటూ తన (Suma) స్టైల్ లోనే తన కొడుకుకి కూడా వార్నింగ్ ఇచ్చారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus