NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Advertisement

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ భారీ ప్రాజెక్ట్ గురించి రోజుకో క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సౌత్ తో పాటు నార్త్ మార్కెట్‌ను కూడా టార్గెట్ చేస్తూ.. మేకర్స్ ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్‌ను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం.

NTR, Neel

ముఖ్యంగా ‘డ్రాగన్’ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మేకర్స్.. ఆలియా భట్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే, RRR తర్వాత ఆలియా నటిస్తున్న రెండో తెలుగు సినిమా ఇదే అవుతుంది. 2024లో ‘జిగ్రా’ సినిమాతో పలకరించిన ఆలియా, ప్రస్తుతం ‘ఆల్ఫా’ మూవీతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే, డ్రాగన్ లో మెయిన్ విలన్‌గా బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్‌ను తీసుకుంటున్నట్లు రెండు రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. డేట్స్ ఇష్యూ వల్ల మలయాళ నటుడు టొవినో థామస్ తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో షాహిద్‌ను ఫిక్స్ చేసే పనిలో ఉన్నారట.

ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. అక్కడ తారక్ పై ఓ హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ మెయిన్ లీడ్‌గా నటిస్తోంది.తారక్ పుట్టినరోజైన మే 20న అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇవ్వాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఆ రోజే ఆలియా భట్, షాహిద్ కపూర్ క్యాస్టింగ్ పై క్లారిటీ ఇవ్వడంతో పాటు, సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రశాంత్ నీల్ ప్లానింగ్ చూస్తుంటే ఈసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus