RRR, KGF2: ఈ సినిమాల రికార్డులు బ్రేక్ కావడం సాధ్యమేనా?

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఆర్ఆర్ఆర్ 1100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించగా కేజీఎఫ్2 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. అయితే ఈ రెండు సినిమాలు క్రియేట్ చేసిన అరుదైన రికార్డులు ఇప్పట్లో బ్రేక్ కావడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. చరణ్ శంకర్ కాంబో మూవీ, మహేష్ రాజమౌళి కాంబో మూవీ,

సలార్ సినిమాలు మాత్రమే ఈ రికార్డులను బ్రేక్ సాధ్యమవుతుందని అయితే ఈ సినిమాలు థియేటర్లలో విడుదల కావడానికి చాలా సమయం పడుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి మహేష్ బాబు సినిమాలో నటీనటుల కోసం ఇప్పటికే ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం రాజమౌళి కమల్ హాసన్ పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ మల్టీస్టారర్ కాకపోయినా ప్రేక్షకులకు కావాల్సిన ప్రత్యేకతలు ఉండేలా జక్కన్న తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సినిమాసినిమాకు రాజమౌళి సినిమాల బడ్జెట్లు పెరుగుతున్నా లాభాలు భారీగానే వస్తుండటంతో నిర్మాతలు రాజమౌళితో భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మించడానికి ముందుకు వస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ సినిమా నిర్మాతకు 200 కోట్ల రూపాయలకు అటూఇటుగా లాభాలు వచ్చాయని సమాచారం. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేసే టాలెంటెడ్ డైరెక్టర్ కూడా రాజమౌళి మాత్రమేనని నెటిజన్లలో చాలామంది భావిస్తారు.

మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమాల ద్వారా నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలు వచ్చాయని సమాచారం. సౌత్ సినిమాల డైరెక్టర్లు సౌత్ సినిమాల ఖ్యాతి మరింత పెరిగే విధంగా అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలకు ఈ డైరెక్టర్లు మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాల వల్ల టాలీవుడ్ పెద్ద సినిమాల బడ్జెట్లు అంతకంతకూ పెరుగుతున్నాయని తెలుస్తోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus