RRR మెయిన్ హీరోపై AI రచ్చ.. ఊహించని ఆన్సర్!

‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా విడుదలై రెండేళ్లు కావస్తున్నా, సినిమా చుట్టూ హాట్ డిబేట్ ఆగడం లేదు. ముఖ్యంగా రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యాన్స్ మధ్య ‘ఎవరికి ఎక్కువ స్కోప్ ఉంది?’ అనే వాదన కొనసాగుతూనే ఉంది. రాజమౌళి (S. S. Rajamouli) ఇద్దరినీ సమానమైన ప్రాముఖ్యతతో చూపించాడని ఎన్నిసార్లు చెప్పినా, ఈ తేడా తేల్చాలనే పోటీ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ వివాదంలో ఏకంగా AI కూడా జంప్ చేసేసింది. ఫ్యాన్స్ నేరుగా X (ట్విట్టర్)లో గ్రోక్ అనే AI బాట్‌ను ప్రశ్నించారు.

RRR

“RRRలో అసలైన కథానాయకుడు ఎవరు?” దీనికి గ్రోక్ ఇచ్చిన సమాధానం ఊహించని రీతిలో బయటకొచ్చింది. “కథను ముందుకు తీసుకెళ్లింది భీమ్ (ఎన్టీఆర్) పాత్రే. మల్లిని కాపాడేందుకు తన ప్రయాణంతో స్టోరీ ప్రారంభమవుతుంది. అయితే, అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్) పాత్ర కూడా కథలో కీలకం.” ఈ సమాధానం విడుదలైన వెంటనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు.

“చూశారా? AI కూడా భీమ్‌కే మెయిన్ రోల్ ఇచ్చింది!” అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం “కథలో రాజు పాత్రకు అత్యధిక ఇంపాక్ట్ ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ ఆర్క్ ఉన్నది చరణ్‌దే” అని వాదిస్తున్నారు. సినిమాలో డ్యూయల్ షేడ్స్ ఉన్న ఏకైక క్యారెక్టర్ రాజుదేనని, ఎమోషనల్ డెప్త్ కూడా ఎక్కువని చెబుతున్నారు. ఇదే వివాదం విడుదల సమయంలో కూడా రాజమౌళి ఎదుట వచ్చింది.

అప్పట్లో ఆయన “ఇది ఇద్దరి కథ. ఇద్దరూ సమాన ప్రాధాన్యత కలిగిన పాత్రలు.” అని స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ, ఎవరికీ ఎక్కువ స్కోప్ ఉందనే ఫ్యాన్ వార్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు AI సమాధానం ఈ కఠిన తేడాను మరింత హీట్ పెంచేలా మారింది. ఇది ఎక్కడ ఆగుతుందో ఎవరికీ తెలియదు. సినిమా చూసిన జనాలకు ఇద్దరూ సమానమే. కానీ ఫ్యాన్స్ మాత్రం ఎవరికో ఒకరికే ఎక్కువ ప్రాధాన్యత ఉందని నిరూపించేందుకు కొత్త కొత్త గొడవలు తెస్తున్నారు. AI కూడా దీనికి జడ్జ్‌గా మారిపోవడంతో ఈ డిబేట్ ఇక మరింత ముదురనుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus