ఆర్.ఆర్.ఆర్ న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ ఇద్దరు తప్పుకోవాల్సిందే!

  • October 3, 2021 / 08:30 AM IST

ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR మరోసారి కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే మూడుసార్లు విడుదల తేదీలను మార్చుకున్న ఈ సినిమా ఫైనల్ గా జనవరి సంక్రాంతి సిజన్ లోనే రాబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. అఫీషియల్ పోస్టర్ తో చిత్ర యూనిట్ సభ్యులు అభిమానులకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ అల్లూరీ సీతారామరాజుగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా అసలైతే దసరా సమయంలో అక్టోబర్ 13న రానున్నట్లు ఇంతకుముందు క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు జనవరి 7న రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇక RRR సినిమా సంక్రాంతి రేసులోకి రావడంతో మిగతా సినిమాలు కొన్ని వాయిదా పడే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ జనవరి 12 వ డేట్ ను ఫిక్స్ చేసుకోగా సర్కారు వారి పాట జనవరి 13 న విడుదల చేయాలని అనుకున్నారు. ఇక జనవరి 16న రాదేశ్యామ్ రాబోతోంది.

ఇక ఈ లిస్ట్ లో పవన్ , మహేష్ వెనుకడుగు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ సినిమాకి గ్యాప్ ఎక్కువగానే ఉంది కాబట్టి సంక్రాంతి బరిలో రెండు సినిమాలకు మంచి వసూళ్లు అందే అవకాశం ఉంటుంది. మరి ఈసారైనా రాజమౌళి అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకు వస్తారో లేదో చూడాలి.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus